ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌పై తెలుగు సినీ ప్రముఖులు సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్.. ప్రకాష్ మాటలపై సీరియస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలు, ట్రోలింగ్‌పై బండ్ల గణేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి లేని వ్యక్తులు కూడా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
తాజాగా వీడియో రిలీజ్ చేసిన హేమ!
ఈ నేపథ్యంలో ఇప్పుడు నటి హేమ కూడా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆమె ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి దొర అనే పదం వాడిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పదం వెనుక ఉన్న అర్థాన్ని ఆయన తెలుసుకోవాలని సూచించారు. రాజకీయంగా విమర్శలు చేయడంలో తప్పు లేదని, ప్రభుత్వ విధానాలు, పార్టీ నిర్ణయాలను విమర్శించవచ్చని ఆమె అన్నారు. కానీ, వ్యక్తిగతంగా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడం సరికాదని స్పష్టం చేశారు.
విమర్శించిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోండి!
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కోట్ల మంది ప్రజలకు తెలుసని, ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హేమ అభిప్రాయపడ్డారు. గతంలో ఇలాంటి విమర్శలు చేసిన వారు ఎదుర్కొన్న పరిణామాలను చరిత్రలో చూడాలని కూడా ఆమె సూచించారు. అలాగే తనతో కలిసి గతంలో పనిచేసిన అనుభవాలను కూడా ఆమె పంచుకున్నారు. షూటింగ్ సమయంలో ప్రకాష్ రాజ్ సమయపాలన విషయంలో కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆమె చెప్పారు. ముందుగా చెప్పిన సమయానికి రాకపోవడం, కొన్ని సందర్భాల్లో దేశం వెలుపల ఉన్నానని చెప్పడం వంటి విషయాలను ఆమె ప్రస్తావించారు.
రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తులు స్పష్టమైన లక్ష్యంతో ఉండాలా? లేదా? అనేది కూడా ప్రశ్నగా మారుతుందని హేమ అన్నారు. ప్రజాసేవ చేయాలంటే స్పష్టమైన ఉద్దేశం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తానికి, ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై మొదట బండ్ల గణేష్ స్పందించగా, ఇప్పుడు నటి హేమ కూడా తన అభిప్రాయాన్ని వీడియో ద్వారా వ్యక్తం చేయడం ఈ వివాదానికి మరింత చర్చను తెచ్చింది.