HomeతెలంగాణKalki 2898 AD Part 2: కల్కి 2 రిలీజ్‌పై బిగ్ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు...

Kalki 2898 AD Part 2: కల్కి 2 రిలీజ్‌పై బిగ్ అప్డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు…!

హైద‌రాబాద్‌,క్రైమ్‌మిర్ర‌ర్‌: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ‘కల్కి 2’పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. మొదట్లో హీరోయిన్ ఎంపిక, నటీనటుల డేట్స్ వంటి కారణాలతో ఆలస్యం జరిగినప్పటికీ ఇప్పుడు అన్ని సమస్యలు సద్దుమణిగినట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో నటించిన దీపికా పదుకొణె స్థానంలో కొత్త హీరోయిన్‌ను తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ జాబితాలో సాయి పల్లవి, ఆలియా భట్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఇక సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రలకు సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్, కమల్ హాసన్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం.

ఈసారి సినిమాను మరింత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారట. ముఖ్యంగా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనుల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ చిత్రాన్ని 2027 డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఇక ప్రభాస్ అభిమానులకు మరో సర్‌ప్రైజ్ కూడా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది అక్టోబర్‌లో ‘కల్కి 2’ టీజర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో అభిమానుల్లో ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు