Homeతెలంగాణఅనకాపల్లి’ మూవీ ‘లబ్బరు బొమ్మ’ సాంగ్ రిలీజ్‌...!

అనకాపల్లి’ మూవీ ‘లబ్బరు బొమ్మ’ సాంగ్ రిలీజ్‌…!

హైద‌రాబాద్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కి ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌ను, పాటల్ని రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.

తాజాగా ‘అనకాపల్లి’ నుంచి అదిరిపోయే మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘లబ్బరు బొమ్మ’ అంటూ సాగే ఈ ఐటం సాంగ్ అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇందులో తారక్ పొన్నప్ప స్టెప్పులు, నందినీ రాయ్ అందాలు ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా ఉన్నాయి. ఇక రాంబాబు గోశాల సాహిత్యం ఎంతో ఫన్నీగా ఉండటంతో పాటుగా దేవ్ జండ్ క్యాచీ ట్యూన్‌ ఇట్టే ఆకట్టుకునేలా ఉంది. ఇక శ్రీ కృష్ణ, సాహితీ చాగంటి గాత్రం మరింత స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. యశ్ మాస్టర్ కొరియోగ్రఫీతో ఈ పాట మరింత ప్రత్యేకంగా మారింది.

ఇప్పటికే ‘అమ్మోరు దిగినాది’ అనే పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ ‘లబ్బరు బొమ్మ’ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచేలా ఉంది. మాస్ ఆడియెన్స్‌కి నచ్చే యాక్షన్ సీక్వెన్స్, యూత్‌ మెచ్చే లవ్ ట్రాక్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కనెక్ట్ అయ్యే ఎమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఈసినిమాలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ తదితరులు న‌టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు