Homeవైరల్Ranaveer Singh: ధురంధర్ -2 ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. 1900 కోట్ల బ్లాక్‌బస్టర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే...!

Ranaveer Singh: ధురంధర్ -2 ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. 1900 కోట్ల బ్లాక్‌బస్టర్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే…!

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ ది రివేంజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తూ ఇప్పటికీ థియేటర్లలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ మూవీ రూ.1900 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సినిమా ఓటీటీ రిలీజ్‌పై పడింది.

సినిమా విడుదలై దాదాపు ఏడు వారాలు గడిచినా ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారిక ప్రకటన రాకపోవడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆలస్యానికి ఒక ముఖ్య కారణం ఉందని తెలుస్తోంది. ఈ మూవీ క్లైమాక్స్‌లో ఉపయోగించిన ‘రంగ్ దే లాల్’ పాటపై వివాదం నెలకొంది. పాత హిందీ సినిమా ‘త్రిదేవ్’లోని పాటను అనుమతి లేకుండా రీమిక్స్ చేశారంటూ దర్శకుడు రాజీవ్ రాయ్ కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును ఢిల్లీ హైకోర్టు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం నిర్మాతలు, సంబంధిత వ్యక్తుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ వివాదం ముగిసే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

స్ట్రీమింగ్ ఎప్పుడంటే…!

సాధారణంగా పెద్ద సినిమాలు థియేటర్లలో విడుదలైన 8 నుంచి 10 వారాల తర్వాత ఓటీటీలోకి వస్తాయి. ఆ లెక్కన చూస్తే ‘ధురంధర్ 2’ మే రెండో వారంలో లేదా మే చివర్లో స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశముంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మే 15 లేదా మే 22 తేదీల్లో సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ యాక్షన్, స్టైలిష్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. హీరోయిన్‌గా సారా అర్జున్ నటించగా, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో కనిపించారు.భారీ యాక్షన్, ఎమోషన్, ట్విస్టులతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీలోకి వస్తే మరింత పెద్ద స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు