క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- బిగ్ బాస్ తో ఫేమస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుత రోజుల్లో ఏదో ఒక రియాల్టీ షోలు, సినిమాలు లేదా బిజినెస్ లతో కెరీర్ పై ఫోకస్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం తప్పు దోవలోకి వెళ్తూ జైలు పాలవుతున్నారు. ఇక తాజాగా బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి ఇదే తవలోకి వచ్చారు. తాజాగా పెళ్లి పేరుతో ఆమె 9.35 కోట్ల రూపాయలు కాజేశారని ఆరోపణలపై హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పెళ్లి పేరుతో తన కొడుకుని నమ్మించి ఆశు రెడ్డి, ఆమె ఫ్యామిలీ ఈ మొత్తాన్ని వసూలు చేసినట్లుగా షేక్ పేటకు చెందిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. తీసుకున్న సొమ్ముతో కార్లు, ఫ్లాట్లు మరియు బంగారం కొన్నారు అని ఆయన ఆరోపించారు. ఎప్పుడైతే పెళ్లి ప్రస్తావన వస్తుందో అప్పుడు ఆమె తప్పించుకుంటూ తిరుగుతుంది అని పోలీసుల ముందు వాపోయారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ విషయంపై ఎంక్వయిరీ చేయడం ప్రారంభించారు. మరి ఈ విషయంపై ఆశు రెడ్డి ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.
ఒక్కరు కాదు.. ముగ్గురే ముద్దు : సీఎం చంద్రబాబు
నేడు డబుల్ ధమాకా… గెలిచే అవకాశం ఈ జట్లదే!