క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- ప్రతి ఏడాది సమ్మర్ లో సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ మంచి కలెక్షన్లు రాబడుతూ ఉండేవి. కానీ ఈ 2026 వేసవి కాలంలో మాత్రం ఎటువంటి భారీ స్థాయి సినిమాలు అయితే రిలీజ్ అవ్వడం లేదు. ఇప్పటికే స్టార్ హీరోలు వాళ్ల వాళ్ల సినిమా షూటింగ్లలో బిజీగా ఉండడంతో ఈ వేసవికాలంలో ఎటువంటి బిగ్ ప్రాజెక్ట్ సినిమా అయితే విడుదల కావడం లేదు. దీంతో ఈ వేసవికాలం ఏవైతే సినిమాలు రిలీజ్ అవుతాయో అవి మంచి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమా ఈ వేసవి కాలం థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈమె నటించిన “మా ఇంటి బంగారం” అనే సినిమా మే 15వ తేదీన విడుదల కాబోతుంది అని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో ఈ మూవీకి కచ్చితంగా 10 నుంచి 20% వరకు బిజినెస్ ఎక్కువగా జరగనుంది అని సినిమా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటూ ఎంతో మంది సెలబ్రిటీలు కూడా చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రేక్షకులకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా భారీ వసూళ్లు వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సమంతకు కూడా ఈ సినిమా తన కెరీర్లో మంచి మూవీ గా మారే అవకాశాలు ఉన్నాయి.
కేటీఆర్ మౌనవ్రతం…! వ్యూహాత్మకమా? లేకుంటే అసంతృప్తా…?
Brutal Crime: బాత్ రూమ్ లో డెలివరీ.. కళ్లు కూడా తెరవని శిశువు దారుణ హత్య, అసలేం జరిగిందంటే?