Homeతెలంగాణపిండి వెంకట్ రెడ్డి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు..!

పిండి వెంకట్ రెడ్డి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు..!

  • పిండి వెంకట్ రెడ్డి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు..!

  • మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

క్రైమ్ మిర్రర్, మాడ్గులపల్లి ప్రతినిధి: నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలము పరిధిలోని పాములాపహాడ్ గ్రామానికి చెందిన పిండి వెంకట్ రెడ్డి (90) గత రెండు నెలలుగా ఆరోగ్యం సహకరించక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. క్రమంలో సోమవారం తుదిశ్వాస విడిచారు. మరణ వార్త తెలుసుకున్న సిపిఎం పార్టీ మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగ రెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి లు వెంకట్ రెడ్డి నివాసానికి చేసుకొని అయన పార్థివ దేహానికి పూలమాల వేసి కామ్రేడ్ వెంకట్ రెడ్డి కి జోహారులు అంటూ నివాళులు అర్పించారు.

పిండి వెంకట్ రెడ్డి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు..!
పిండి వెంకట్ రెడ్డి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు..!

సందర్బంగా వారు మాట్లాడుతూ..పిండి వెంకట్ రెడ్డి యుక్త వయసు కానుంచి కమ్యూనిస్టు పార్టీకి ఎనలేని సేవ చేసినాడు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతో నష్టపోయిన, రకరకాల రాజకీయ సమీకరణాలు జరుగుతున్న కూడా పార్టీని వీడకుండా పార్టీ కోసమే పని చేసిన నాయకుడు, నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, అనునిత్యం పార్టీ ఎదుగుదల కోసం పనిచేసిన మహా నాయకుడు పాములపాడు గ్రామంలో యాతం పాపి రెడ్డి తరువాత తన వారసుడిగా పిండి వెంకట్రెడ్డి పార్టీని నిలబెట్టడం జరిగింది అన్నారు.

గ్రామాలలో ఇప్పటికీ ఇలాంటివి నీస్వార్థ నాయకులు ఉన్నంతకాలం కమ్యూనిస్టు పార్టీ బ్రతికే ఉంటుంది ఎంతో మంది పాలకవర్గాలు మారిన పేద ప్రజల పక్షాన కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం పనిచేస్తూ ఉంది అని అన్నారు. అలాగే వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబానికి సిపిఎం రాష్ట్ర కమిటీ పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, డబ్బికారు మల్లేశం, పార్టీ మండల కార్యదర్శి రొండి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు రెముడాల పరుశరాములు, పార్టీ మండల కమిటీ సభ్యులు తంగెళ్ల నాగమణి, దేవి రెడ్డి, అశోక్ రెడ్డి, శ్రీకర్, శాఖ కార్యదర్శి చింతచర్ల శ్రీను, నాయకులు అలుగుబిల్లి వెంకటరెడ్డి, చింతచెర్ల లింగయ్య, గండమల్ల పరుశరాములు, రొయ్య బిక్షం, ఎల్లుట్ల వెంకటయ్య, అంతటి మంగమ్మ, కోదాడ సోమయ్య, కుటుంబ సభ్యులు పిండి ఇందిర, అరుణ, ఉమా తదితరులు పాల్గొన్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు