Homeతెలంగాణమర్రిగూడలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

మర్రిగూడలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.

మర్రిగూడ(క్రైమ్ మిర్రర్): ​భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను, మర్రిగూడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వీరమళ్ళ శిరీష లోకేష్ గౌడ్, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి, పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, అక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సర్పంచ్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మునయ్య, మాజీ సర్పంచ్ నల్ల యదయ్య గౌడ్, సూపర్డెంట్ యాకుబ్, పంచాయతీ కార్యదర్శి యూసుఫ్, వార్డు సభ్యులు ఎండి జమీర్, మహేశ్వరం యాదమ్మ రమేష్, నల్ల చంద్రశేఖర్ గౌడ్, సిలివేరు రఘు, తిరుమని అంజమ్మ, పందుల రాములు గౌడ్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ మహేశ్వరం సతీష్, మీడియా ప్రతినిధులు గునుగంటి యదయ్య, గొట్టిముక్కుల ప్రకాష్, స్థానికులు ఈద రాములు, అమంచ రమేష్, పల్లె ప్రవీణ్, ఎడ్ల ముత్తయ్య, అబ్రహం, నజీర్, ఆర్నల్, రవి, నగేష్, గౌస్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు