HomeతెలంగాణTelugu Heroines 2026: 2026లో కూడా హీరోయిన్ల పరిస్థితి ఇదేనా...?

Telugu Heroines 2026: 2026లో కూడా హీరోయిన్ల పరిస్థితి ఇదేనా…?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ సినిమా బ్యూరో: టాలీవుడ్ పాపులర్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని మరోసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి గురించి ఆలోచించేలా చేసింది. హాలీవుడ్ రిపోర్టర్ నిర్వహించిన “వుమెన్ ఇన్ ఎంటర్టైన్‌మెంట్” ఈవెంట్‌లో సమంత మహిళల గురించి..ముఖ్యంగా సినిమా రంగంలో వారి స్థానం గురించి చాలా మాట్లాడింది.

సమంత మాట్లాడుతూ.. అమ్మాయిలు చాలా సార్లు అవసరం లేకపోయినా “సారీ” చెప్పే పరిస్థితిలో ఉంటారని తెలిపింది. ఇది మన సమాజంలోనే కాదు, సినిమా ఇండస్ట్రీలో కూడా కనిపించే విషయమని.. మహిళలు తమ అభిప్రాయాలను బలంగా చెప్పాలంటే ఇంకా కొంత భయం, సంకోచం ఉన్నట్టు.. కానీ అది మారాలి అని ఆమె ఆశిస్తున్నాను అని తెలిపింది.

ఇంకా ఇదే ఈవెంట్ లో.. సమంత మాట్లాడుతూ..”సినిమాల్లో మహిళల పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉండాలి. వారు కేవలం ఒకరి భార్యగా.. లేదా హీరో కోసం మాత్రమే ఉండే పాత్రలు కాకూడదు. హీరోయిన్ సినిమాలు కూడా హీరోల సినిమాల లాగే అందరూ చూసే రోజులు వస్తాయి.. అని నేను భావిస్తున్నాను,” అని చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలో ఈమె చెప్పిన మాటల గురించి సోషల్ మీడియాలో ఎన్నో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2026లో కూడా మన సినిమా ఇండస్ట్రీ.. ఇలానే ఉందా అనే సందేహం ఎంతోమందిలో ఉండొచ్చు. సినిమాల్లో హీరోయిన్ అంటే పాటలు పాడటం, హీరోతో ప్రేమలో పడటం, చివరికి అతనికి సపోర్ట్ ఇవ్వడం.. మాత్రమే చూపించే సినిమాలు ఇప్పటికీ లేకపోలేదు.

తెలుగు సినిమాలో అదే ధోరణి..!

మన తెలుగు సినిమాలనే పరిశీలిస్తే..కొంతమంది దర్శకులు నిజంగా మహిళల పాత్రలను గొప్పగా చూపించారు. ఉదాహరణకు కే విశ్వనాథ్, శేఖర్ కమ్ముల, రాహుల్ రవీంద్రన్ లాంటి దర్శకులు తమ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు.. మంచి ప్రాధాన్యత ఇచ్చారు. వారి సినిమాల్లో అమ్మాయిలు బలంగా, ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు.

కానీ మరో వైపు చూస్తే, చాలా సినిమాల్లో ఇంకా పాత.. ధోరణి కొనసాగుతోంది. హీరోయిన్ అంటే హీరోకి తోడు నిలిచే వ్యక్తి మాత్రమే అన్న భావన ఇంకా ఉంది. కొన్ని సినిమాల్లో అయితే అమ్మాయిలను బలహీనంగా.. చూపించడం కూడా జరుగుతోంది. ఈ మధ్య వచ్చిన ఒక పవర్ స్టార్ సినిమాలో.. ఒక అమ్మాయిని రేప్ చెయ్యగా.. ఆ సీన్ పెట్టుకొని హీరోని ఎలివేట్ అయ్యేలా సీన్ చిత్రీకరించారు దర్శకుడు. అక్కడ అమ్మాయిని రేప్ చేసిన విలన్ ని హీరో చంపడం కరెక్టే.. కానీ హీరో ఎలివేట్ అవ్వాలి అంటే తప్పకుండా అమ్మాయిల పైనే వీక్ సీన్ రాసుకోవడం.. అనేది కరెక్ట్ కాదు. అదే సినిమాలో మొదటి సీన్ లో హీరో ఇంట్రడక్షన్ కోసం కూడా ఒక అమ్మాయి చీర లాగుతారు విలన్. అంటే అమ్మాయిలను.. విలన్ హింసిస్తూ ఉంటే.. వాళ్లు వాళ్లకి ఏమి చేసుకోలేనప్పుడు.. వచ్చి కాపాడితే హీరోయిజం ఎలివేట్ అవుతుంది..అన్నట్లే ఈ సినిమా మొత్తం సాగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో చిన్న చిన్న సమస్యలకు కూడా హీరోయిన్.. హీరో సహాయం తీసుకోవాల్సిన పరిస్థితిగా చూపిస్తారు.

అంతేకాదు, ప్రేమ కథల పేరుతో వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా అమ్మాయిల పాత్రలు.. సరైన విధంగా చూపించబడడం లేదు. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి చిత్రాలలో..అబ్బాయిలు ఎలా ప్రవర్తించినా అమ్మాయిలు చివరికి సర్దుకుపోవాల్సిందే.. అన్న భావన చూపిస్తారు. మరి ఈ కాలంలో కూడా మన దర్శకులు ఇలాంటి సీన్లు.. ఎందుకు తీస్తున్నారు అనేది చాలామందికి ఉన్న సందేహం.

తెలుగు ఇండస్ట్రీ పబ్లిక్ ఈవెంట్స్ లో కూడా అదే పరిస్థితి..!

సినిమాల విషయం పక్కన పెడితే..ఒక స్టార్ హీరో పబ్లిక్ ఈవెంట్‌లో “మనవడు పుడితే బాగుంటుంది” అని చెప్పడం కూడా ఈ మధ్య మనము విన్నాం. ఇలాంటి వ్యాఖ్యలు కూడా సమాజంలో ఇంకా లింగ వివక్ష ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి. ఆ తరువాత ఆ మాటలను కప్పిపుచ్చేందుకు.. వాళ్ళ ఇంట్లో వాళ్లే.. వివరణలు ఇచ్చినా.. అప్పటికే జరగాల్సిన డామేజ్ మొత్తం జరిగింది. ఏది ఏమైనా.. అసలు అక్కడ అబ్బాయి పుడితే బాగున్ను.. వారసత్వం కంటిన్యూ అవుతుంది అని ఒక పబ్లిక్ ఈవెంట్లో ఒక సెలబ్రిటీ చెప్పడం తప్పే. ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిల కన్నా కూడా ఎంతో మంది.. అమ్మాయిలు వాళ్ల తల్లిదండ్రుల పేర్లను నిలబెడుతున్నారు. ఈ క్రమంలో పబ్లిక్ ఈవెంట్లో.. అలాంటి మాట అనేసి ఆ తర్వాత క్షమాపణ చెప్పకపోగా.. దాన్ని కప్పిపుచ్చుకుంటూ.. మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు కొనసాగారు. ఇవన్నీ చూస్తే సమంత చెప్పిన మాటల్లో రవ్వంత కూడా అబద్ధం లేదు అనిపిస్తుంది.

సమంత చెప్పింది నిజమే..!

సమంత మరో ముఖ్యమైన విషయం కూడా మాట్లాడింది. సినిమా సెట్లలో మహిళల భద్రత చాలా ముఖ్యమని ఆమె చెప్పింది. భద్రత అనేది ఒక్కసారి మాట్లాడే విషయం కాదు, ప్రతి రోజు పాటించాల్సిన ఒక నియమం కావాలని ఆమె అభిప్రాయపడింది. ఇది నిజంగా చాలా అవసరమైన విషయం.

ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. అయినా కూడా సమంత చెప్పిన విషయాలు ఇప్పటికీ వర్తిస్తాయా అంటే… చాలా వరకు అవును అని చెప్పాల్సి వస్తుంది. కొంత మార్పు వచ్చినా, పూర్తిగా మార్పు ఇంకా రాలేదు.

ముందు రోజుల్లో హీరో సినిమాల్లాగే.. హీరోయిన్ సినిమాలు కూడా సమానంగా రావాలి. హీరో, హీరోయిన్ అనే తేడా లేకుండా ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉండే కాలం రావాలి. మహిళల కథలు కూడా పెద్ద స్థాయిలో చెప్పబడాలి.

సమంత కలగంటున్న ఆ మార్పు వెంటనే రాకపోయినా, భవిష్యత్తులో తప్పకుండా వస్తుందని ఆశించవచ్చు. కానీ ఆ మార్పు రావాలంటే, ముందుగా సినిమాల్లోనే ఆ ఆలోచన మొదలవ్వాలి. దర్శకులు, హీరోలు, ప్రేక్షకులు అందరూ కలిసి ఆ మార్పును ఆహ్వానిస్తేనే నిజమైన సమానత్వం కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు