ఢిల్లీ, క్రైమ్‌మిర్రర్: కెనడాలో చోటు చేసకున్న ఘోర అగ్ని ప్రమాదంలో నలుగురు సైనికులు మృతి చెందగా 39 మందికి తీవ్ర గాయాలయ్యాయి.అల్బెర్టా ప్రావిన్స్‌లోని సైనిక శిక్షణా స్థావరంలో మంటలు చెలరేగి నలుగురు కెనడియన్ సైనికులు మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. గాయపడిన వారిలో 19 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.
సైనికులు లైవ్ మందుగుండు సామగ్రితో యుద్ధ శిక్షణ పొందుతున్న సమయంలో అక్కడ గడ్డి మైదానంలో మంటలు చెలరేగాయి. గంటకు96 కిలోమీటర్ల వేగంతో గాలులు రావడంతో మంటలు 30 నుంచి 60 సెకన్లలోపే వారిని చుట్టుముట్టాయి. దీంతో తప్పించుకునే సమయంలోనే నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్ది మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి మార్క్ కార్నీ స్పందిస్తూ కెనడా గడ్డపై సైనిక దళాలకు ఎదురైన అత్యంత ఘోరమైన విషాదాలలో ఒకటని పేర్కొన్నారు. మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవి కూడ చదవండి:
- షేర్ మార్కెట్ నష్టాలు… తీవ్ర మనస్తాపంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మ\హత్య…! కలకలం..
-
భారీ అగ్ని ప్రమాదం…! భయంతో పరుగులు తీసిన ప్రజలు..
-
నయా ప్రాజెక్ట్‌లతో ముందంజలో వరుణ్ తేజ్: ‘బరి’ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్!
-
రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని ఎలా పెంచుకోవాలి?: ఆరోగ్య నిపుణుల కీలక సూచనలు
