Homeజాతీయంహైద‌రాబాద్ న‌డిబొడ్డున మైనింగ్ విధ్వంసం...హ‌రీశ్ రావు ఫైర్‌

హైద‌రాబాద్ న‌డిబొడ్డున మైనింగ్ విధ్వంసం…హ‌రీశ్ రావు ఫైర్‌

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: హైద‌రాబాద్ న‌డిబొడ్డున పెద్ద ఎత్తున మైనింగ్ జ‌రుగుతున్న అధికారులు, సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నార‌ని, ప్ర‌తిప‌క్షాల మీద సిట్ లు వేసే ముఖ్య‌మంత్రి ఎందుకు మాట్లాడ‌ద‌ర‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు. నేను ప్ర‌జ‌ల‌కు న్యాయం చేస్తున్న‌, చెరువుల‌ను కాపాడుతున్నాన‌ని చెప్పే సీఎం రేవంత్ రెడ్డికి నాద‌ర్‌గూల్ క‌బ్జా క నిపించడం లేదా అని మండిప‌డ్డారు. అంతేగ‌కుండా 373 ఎక‌రాల్లో 17 ఎక‌రాల ల‌చ్చ‌మ్మ కుంట‌, 6 ఎక‌రాల బ‌ఫ‌ర్ జోన్ఉంది. ఆ చెరువు వ‌చ్చే ఫీడ‌ర్ చాన‌ల్స్‌ను కంపెనీన్ని ద్వంసం చేశాయ‌ని ఆవేద‌న చెందారు.

ల‌చ్చమ్మ కుంట నిండితే అక్కడి నుంచి నాన్ చెరువు, మర్రివాని కుంట, రెడ్డి కుంట, సున్నం చెరువు, చివరకు ఇంజాపూర్ మాసం చెరువు వరకు నీళ్లు వెళ్తాయి. కాని రంగ‌నాథ్ హైడ్రా ను ఎందుకు పంపించ‌డం లేదు, రేపు ఉదయం కల్లా హైడ్రా రంగనాథ్ అక్కడకు వెళ్లి చర్యలు తీసుకోకపోతే.. ఎమ్మెల్యేలతో కలిసి మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే అక్కడికి వెళ్తాం. అంతేకాకుండా అక్కడ ఉన్న 80 నుంచి 100 ఎకరాల గుట్టలను 12 ఎకరాలు లింగమయ్య గుట్ట మినహా మిగతాదంతా మింగేశారన్నారు.

ఇది ముమ్మాటికీ మంత్రి పొంగులేటి కంపెనీయే..

హైదరాబాద్ నడిబొడ్డున ఇంత మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు..? ప్రతిపక్షాల మీద సిట్ లు వేసే రేవంత్ రెడ్డి దీనిపై ఎందుకు మాట్లాడరు..? ఈ కంపెనీల కబ్జాల వెనుక సాక్షాత్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వాళ్లు చుట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు పెడుతున్నారు. ముందు కోహినూర్ గ్రూప్ అని, తర్వాత శిల్పా ఇన్ఫ్రా, మెగా కంపెనీ అని మార్చి మార్చి బోర్డులు పెడుతున్నారు.

శిల్పా ఇన్‌ఫ్రా, శిల్పా రాఘవ (ఎల్ఎల్‌పీ) లలో మంత్రి పొంగులేటి కొడుకు హర్షారెడ్డి, లోహిత్ రెడ్డి, స్వప్న రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారు. క్రిస్టల్ మాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో కూడా హర్షారెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. ఇది ముమ్మాటికీ మంత్రి పొంగులేటి కంపెనీయే అని స్పష్టమైంది. రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఈ కబ్జాల వెనుక ఉన్నప్పుడు ఆర్డీవో, హైడ్రా లాంటి చిన్న అధికారులు వారిని ఎలా అడ్డుకుంటారు.. ? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే తక్షణమే హైడ్రాను పంపించి ఆ అక్రమ కాంపౌండ్ వాల్ ను కూలగొట్టాలి. ఆక్రమించిన వారిని అరెస్ట్ చేసి దొంగలు ఎవరో బయటపెట్టాలి. తాత ముత్తాతల నుంచి వ్యవసాయం చేసుకుంటున్న రైతులను తిరిగి ఆ భూముల్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments