Homeక్రైమ్దేశంలోనే ఫ్యూచ‌ర్ సిటిగా అమ‌రావతి నిర్మాణం...సీఎం చంద్ర‌బాబు నాయుడు..!

దేశంలోనే ఫ్యూచ‌ర్ సిటిగా అమ‌రావతి నిర్మాణం…సీఎం చంద్ర‌బాబు నాయుడు..!

అమరావతి, క్రైమ్ మిర్ర‌ర్: అమ‌రావ‌తిని దేశంలో ఫ్యూచ‌ర్ సిటిగా మారుతుంద‌ని సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్నారు. రాజ‌ధాని నిర్మాణ ప‌నుల‌పై క్యాంప్ కార్యాల‌యంలో ఉన్న‌త స్థాయి అధికారుల‌తోస‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. సమీక్షకు హాజరైన రాయణ, సీఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, రాజధాని నిర్మాణ పనులు చేస్తోన్న సంస్థల ప్రతినిధులు హజరయ్యారు.

ప్రస్తుతం రాజధానిలో వివిధ దశాల్లో సాగుతోన్న రూ.57,821 కోట్ల విలువైన పనులు, హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్‌ఫ్రాస్ర్ట‌క్ష‌ర్లు, ఎల్పిఎస్ ఇన్ఫాస్ర్ట‌క్షర్‌ తో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణం, వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన, రద్దు చేసిన పనులకు సంబంధించి ఉన్న వివాదాలనై సమీక్ష నిర్వ‌హించారు. ప్రస్తుతం రాజధానిలో 20 వేల మంది కార్మికులు, నిపుణులు పనులు చేస్తున్నారు. ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసింది…టార్గెట్ ను ఎంత మేరకు చేరుకున్నారనే విషయంలో పనుల వారీగా సీఎం సమీక్ష నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా వారం, నెల టార్గెట్ పెట్టుకుని పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
వర్షాకాలం వచ్చే సమయానికి పూర్తి చేయాల్సిన పనులపై తాము పెట్టుకున్న లక్ష్యాలను అధికారులు వివరించారు. రాజధాని నిర్మాణమనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్ గా చూడొద్దు… ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములువుతున్నట్టే. నిర్మాణ సంస్థలుగా మీరు ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారు…కానీ రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు. రాజధానిని అద్భుతంగా, వినూత్నంగా నిర్మించేందుకు అపార అవకాశాలున్నాయి.

అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపించాల్సింది మీరే. • నాణ్యతతో నిర్మాణాలు ఉండాలి… కాస్ట్ ఎఫెక్టివ్ చర్యలు తీసుకోవాలి… గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ వంటి వాటిని వినియోగించుకోవాలి. రాజధాని ప్రతిష్టను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చు. మ్యాన్ పవర్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది… ప్రతి నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రారంభించుకోవాలని సీఎం అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments