Homeక్రైమ్ఘోర రోడ్డు ప్ర‌మాదం... సింగ‌రేణి ఉద్యోగి మృతి...!

ఘోర రోడ్డు ప్ర‌మాదం… సింగ‌రేణి ఉద్యోగి మృతి…!

గోదావ‌రిఖ‌ని, క్రైమ్ మిర్ర‌ర్: పెద్ద‌ప‌ల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది. దీంతో ఆ ప్రాంతంలో విషాదం అలుముకుంది. గోదావ‌రిఖ‌నిలోని రాజేశ్ థియేట‌ర్ వ‌ద్ద వేగంగా దూసుకొచ్చిన కారు ర‌హ‌దారి ప‌క్క‌నున్న‌విద్యుత్ స్తంభానికి ఢీ కొట్ట‌డంతో కారు నుజ్జు నుజ్జు అయింది.కారులో ఉన్న న‌లుగురిలో ఒక‌రు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయాడు. మ‌రో ముగ్గురి ప‌రిస్థ‌తి విష‌యంగా ఉండ‌డంతో చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతుడిని సింగ‌రేణి ఉద్యోగి శ్రీధ‌ర్‌గా పోలీసులు గుర్తించారు. అతివేగ‌మే ఈ ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని పోలీసులు తేల్చారు. మృతుడి నివాసంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

 

తాజావార్తలు