Homeక్రైమ్నాటో మాకు అవ‌స‌రం లేదు...ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

నాటో మాకు అవ‌స‌రం లేదు…ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఢిల్లీ, క్రైమ్ మిర్ర‌ర్: నాటో మాకు అవ‌స‌రం లేద‌ని నాటో నుంచి ఇక త‌ప్పుకునే అంశాన్ని ప‌రిశీలిస్తున్న‌ట్లు అమెరికా అధ్య‌క్షులు డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఇరాన్ పై మేము చేస్తున్న స‌మ‌యంలో నాటో దేశాలు మాకు స‌హ‌క‌రించాల‌ని కోరిన ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా చేప‌ట్టిన సైనిక చ‌ర్య‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని మండిప‌డ్డారు. వాళ్లు స‌హ‌క‌రించ‌నివ‌ల్ల‌నే మేము త‌ప్ప‌కునేందుకు ప‌రిశీలిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

నాటో కూటమిని కాగితపు పులిగా అభివర్ణించారు ట్రంప్. నాటో విశ్వసనీయతపై తనకు ఎప్పటి నుంచో చాలా సందేహాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బ్రిటన్ యుద్ధనౌకల దుస్థితిపై ట్రంప్ నేరుగా విమర్శలు గుప్పించారు. ‘మీకు నావికాదళమే లేదు. మీరు చాలా పాతబడిపోయారు. పైగా మీ వద్ద పనిచేయని విమాన వాహక నౌకలు ఉండేవి’ అని ఎద్దేవా చేశారు. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ రక్షణ వ్యయాన్ని పెంచాలా? అని సదరు రిపోర్టర్ ప్రశ్నించగా.. తానేమీ సలహా ఇవ్వనని, ఆయనకు నచ్చింది చేసుకోవచ్చన్నారు.

తాజావార్తలు