Homeక్రైమ్ఆటో డ్రైవ‌ర్ నిజాయితీ...అభినందించిన ఎస్సై

ఆటో డ్రైవ‌ర్ నిజాయితీ…అభినందించిన ఎస్సై

మహబూబ్ నగర్, క్రైమ్ మిర్ర‌ర్‌: ఈ నెల 21న‌ ఉమాదేవి గద్వాల్‌కు వెళ్లేందుకు ఆటోలో ప్రయాణించారు. పొన్నకల్ స్టేజ్ వద్ద బస్సు ఎక్కే తొందరలో త‌న ద‌గ్గ‌ర ఉన్న బ్యాగ్‌ను ఆటో దిగారు.తన వద్ద ఉన్న రూ.62,000 నగదు కలిగిన బ్యాగ్ ఆటోలోనే మర్చిపోయిన విషయం గుర్తించి వెంటనే అడ్డకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఎం.శ్రీనివాస్ వెంటనే స్పందించి పీసీ ఏ.రాహుల్ కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు.

పీసీ రాహుల్ మండల పరిధిలోని సీసీ కెమెరాలను పరిశీలించి, ఆటో నంబర్ టీఎస్ 38 టీ 2272ను గుర్తించి డ్రైవర్ చంద్రకాంత్ ఖిలగానాపూర్, వనపర్తి జిల్లా వాసిగా గుర్తించారు. పోలీసులు విచారణకు వెళ్లగా, డ్రైవర్ చంద్రకాంత్ డబ్బులు ఎవరికివ్వాలో తెలియక తన వద్ద భద్రపరచుకున్నట్లు తెలిపారు.

అనంతరం ఆయన నిజాయితీగా స్పందించి, బ్యాగ్ తో పాటు అందులో ఉన్న రూ.62,000 నగదును పీసీ రాహుల్ కి అప్పగించారు. ఆ తరువాత పీసీ రాహుల్ ఆ మొత్తాన్ని ఎస్ఐ శ్రీనివాస్ కి అందజేయగా సోమ‌వారం అడ్డకల్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఉమాదేవి నగదు తిరిగి అందజేశారు

తాజావార్తలు