Saturday, March 7, 2026
Homeతెలంగాణమ‌హిళ శ‌క్తిని ప్ర‌పంచానికి చాటి చెప్పాలి

మ‌హిళ శ‌క్తిని ప్ర‌పంచానికి చాటి చెప్పాలి

  • మ‌హిళ సంక్షేమమే సేవా స‌మితి ల‌క్ష్యం

  • సింగ‌రేణి సేవా స‌మితి అధ్య‌క్షురాలు వాణి రాధాక్రిష్ణ‌

 

మంచిర్యాల‌, క్రైమ్ మిర్ర‌ర్‌: నేటి స‌మాజంలో పురుషుల‌కు ధీటుగా మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించి మ‌హిళ శ‌క్తి ఏంటో ప్ర‌పంచానికి చాటి చెప్పాల‌ని మంద‌మ‌ర్రి సేవా స‌మితి అధ్య‌క్షులురాలు వాణి రాధాక్రిష్ణ తెలిపారు. ఈ నెల 8న ప్ర‌పంచ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం స్థానిక సీఈఆర్ క్ల‌బ్‌లో మ‌హిళ‌ల‌కు క్రీడ‌లు సంస్కృతిక పోటీల‌ను నిర్వ‌హించారు.
ఈ పోటీల‌కు ముఖ్య అతిథిగా హాజ‌రైన ఆమె మాట్లాడుతూ సింగ‌రేణి యాజ‌మాన్యం చేయూత‌తో సేవా స‌మితి అనేక సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తుంద‌ని తెలిపారు. ప్రతి సంవ‌త్స‌రం మ‌హిళా దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తూ మ‌హిళ‌ల‌కు వివిధ పోటీల‌ను కూడ ఆన‌వాయితిగా వ‌స్తుంద‌ని తెలిపారు. మ‌హిళ సంక్షేమమే ల‌క్ష్యంగా సేవా స‌మితి ప‌ని చేస్తుంద‌ని తెలిపారు. ఈ పోటిల్లో గెలుపొందిన వారికి ఈ నెల 8న జీఎం చేతుల మీదుగా బ‌హుమ‌తులు ప్ర‌ధానం చేస్తార‌ని తెలిపారు.
సేవా స‌మితి ఆధ్వ‌ర్యంలో ఉత్త‌మ మ‌హిళ‌ల‌ను స‌న్మానించ‌డం జ‌రుగుతుంద‌ని ఆమె తెలిపారు. మ‌హిళ‌ల స్వ‌యం ఉపాధి కోసం టైల‌రింగ్ బ్యుటిషియ‌న్‌, మ‌గ్గం వ‌ర్కుతో పాటు కంప్యూట‌ర్ శిక్ష‌ణ అల్లిక‌లు, పేప‌ర్ బ్యాగ్ త‌యారి లాంటివి ఇస్తున్నామ‌ని తెలిపారు. అనంత‌రం ఆమె త్రోబాల్ బాంబింగ్ బ్లాస్ట్ గ్రూపు డ్యాన్స్ పోటీల‌కు ప్రారంభించారు. ఈ పోటీల‌కు దాదాపు 300కు పైగా మ‌హిళ‌లు హాజ‌ర‌య్యారు. వ‌య‌స్సుతో సంబంధం లేకుండా మ‌హిళ‌ల‌కు ప్ర‌ద‌ర్శించిన సంస్కృతిక నృత్యాలు ఆక‌ట్టుకున్నాయి
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments