Homeక్రైమ్బిష్ణోయ్‌ గ్యాంగ్‌ వెనుక భారీ కుట్ర.. పోలీసుల విచారణలో కీలక విషయాలు

బిష్ణోయ్‌ గ్యాంగ్‌ వెనుక భారీ కుట్ర.. పోలీసుల విచారణలో కీలక విషయాలు

క్రైమ్ మిర్రర్ : బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. విచారణలో భాగంగా ఈ దాడి వెనుక ఉన్న కుట్రకు సంబంధించిన పలు వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌కు చెందిన హ్యాండ్లర్లు సోషల్‌ మీడియా ద్వారా బీహార్‌లోని బెగుసరాయ్‌కు చెందిన రితిక్‌ అలియాస్‌ రోషన్‌, హర్యానాలోని సోనీపట్‌కు చెందిన రేహాన్‌, ఫూల్‌ సింగ్‌ అనే యువకులను సంప్రదించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

గతంలో వివాదాలు, ఆయుధాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసుల్లో పేరున్న ఈ యువకులను దాడి కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించడంతో పాటు భవిష్యత్తులో భారీ మొత్తంలో డబ్బు అందిస్తామని ఆశచూపి, బాలీవుడ్‌ నటుడిపై కాల్పులు జరపాలని వారికి సూచించినట్లు సమాచారం. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు ముందస్తుగా రూ.50 వేల నగదు అందజేశారని, దాడి పూర్తయిన తర్వాత మరింత మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలుస్తోంది. అమెరికాలో ఉంటున్నట్లు చెబుతున్న లారెన్స్‌ బిష్ణోయ్‌ అనుచరుడు, గ్యాంగ్‌స్టర్‌ అనిల్‌ పండిత్‌ ఈ ముగ్గురితో తరచూ సంప్రదింపులు జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.

అనిల్‌ పండిత్‌ సూచనల మేరకు నిందితులు టైగర్‌ ష్రాఫ్‌ రాకపోకలపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వారాంతాల్లో ఫుట్‌బాల్‌ ఆడేందుకు ఆయన జుహూ ప్రాంతానికి వెళ్తున్న విషయాన్ని గమనించి, తిరిగి వచ్చే సమయంలో దాడి చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ క్రమంలో మోటార్‌ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు టైగర్‌ ష్రాఫ్‌ కారును లక్ష్యంగా చేసుకుని ఐదు నుంచి ఆరు రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం. అయితే, నిందితుల్లో ఒకరి తుపాకీ పనిచేయకపోవడంతో వారు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

దాడి అనంతరం నేపాల్‌కు పారిపోయేందుకు ప్రయత్నించిన ముగ్గురు నిందితులను రాజస్థాన్‌లోని కోటా వద్ద రైలులో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన వెనుక ఉన్న కుట్ర, ఇతర వ్యక్తుల ప్రమేయం, నిందితులకు అందిన ఆదేశాలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: ముదురుతున్న ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం….! వెయ్యిడ్రోన్ల‌తో భీక‌ర దాడులు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు