Friday, February 27, 2026
Homeఆంధ్ర ప్రదేశ్ఇంద్రకీలాద్రిపై ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి ప్ర‌త్యేక పూజ‌లు

ఇంద్రకీలాద్రిపై ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి ప్ర‌త్యేక పూజ‌లు

విజయవాడ, క్రైమ్ మిర్ర‌ర్:  తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి కి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, అర్చకులు ఘనస్వాగతం పలికారు.

అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో మంత్రి కి ప్రత్యేక ప్రోటోకాల్ దర్శన ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకుని మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రి కి వేదాశీర్వచనం అందజేశారు.

ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మంత్రి కి అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రం ,అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఉప ముఖ్య‌మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజు ,ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments