-పుర చైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్
క్రైమ్ మిర్రర్,కల్వకుర్తి:- పవిత్ర రంజాన్ ఉపవాస మాసంలో ముస్లీంలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని మస్జిద్ లలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తానని మున్సిపాలిటీ చైర్ పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని మస్జిద్ ల కమిటీ సభ్యులతో కలిసి మున్సిపాలిటీ చైర్ పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, వివిధ వార్డుల కౌన్సిలర్లు మస్జిద్ లను సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్ పర్సన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ ఉపవాస మాసం నేటి నుంచి ప్రారంభమవుతున్న సందర్బంగా రంజాన్ మాసంలో మస్జిద్ ల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తేవాలని వెంటనే వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మున్సిపాలిటీ కౌన్సిలర్లు నాజియా మక్బూల్, షేక్ ఏజాస్, మబ్బు రామరాజు, రాజేష్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రమాకాంత్ రెడ్డి, సయ్యద్ మసూద్, ముస్లీం మైనార్టీ నాయకులు సాబేర్, విక్కీ, యాహియఖాన్, ముక్తాధర్, అబ్దుల్ ఖాదర్, ముజీబ్, సాలం, అఖిల్, సోహెల్, అబ్బు, యూసుఫ్, తదితరులు ఉన్నారు.
యాదగిరిగుట్టలో ప్రారంభమైన స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు
