Homeక్రైమ్Shocking Wedding Twist: పెళ్లి కొడుకుపై హత్యాయత్నం.. పెళ్లి కూతురి ఏడుపు.. సీన్ కట్ చేస్తే...

Shocking Wedding Twist: పెళ్లి కొడుకుపై హత్యాయత్నం.. పెళ్లి కూతురి ఏడుపు.. సీన్ కట్ చేస్తే షాకింగ్!

Groom Attack Case: కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి మండపానికి కారులో బయలుదేరి వెళ్తున్న వరుడిపై మార్గమధ్యంలో దాడి జరిగింది. కొందరు దుండగులు కారుని అడ్డగించి వరుడిపై దాడికి దిగారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. తీవ్ర గాయాలతో ఉన్న పెళ్లి కొడుకును హాస్పిటల్‌కు తరలించారు. అక్కడకు చేరుకున్న పెళ్లి కూతురు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆమె ఓవరాక్షన్ పోలీసులకు అనుమానం కలిగించింది. తీగ లాగితే.. డొంకంతా కదిలింది.

అసలేం జరిగిందంటే?

కర్ణాటకలోని కొళ్లేగాల పట్టణానికి చెందిన రవీశ్ (34)కు, నవీన అనే యువతితో వివాహం నిశ్చయమైంది. గత వారం పెళ్లి మండపానికి వెళ్తున్న రవీశ్‌పై మార్గమధ్యంలో దాడి జరిగింది. దర్శన్ అనే యువకుడు మరో ఇద్దరితో కలిసి రవీశ్‌పై దాడి చేశాడు. ముగ్గురూ అతడిని కత్తులతో పొడిచి పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న రవీశ్‌ను స్థానికులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది.

అసలు ట్విస్ట్ ఏంటంటే?

హాస్పిటల్‌కు చేరుకున్న నయన కన్నీరు మున్నీరుగా విలపించింది. గాయాలు తగ్గిన తర్వాత తననే పెళ్లి చేసుకోవాలని వేడుకుంది. విచారణ ప్రారంభించిన పోలీసులకు నయన మీద అనుమానం వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభిస్తే నిజం అంగీకరించింది. దర్శన్‌ తో నయన చాలా రోజులుగా ప్రేమలో ఉందని బయటపడింది. దర్శన్‌తో కలిసి ఉండడం కోసమే రవీశ్‌ను చంపాలని నయన నిర్ణయించుకుంది. అయితే అదృష్టవశాత్తూ రవీశ్ ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు