Homeక్రైమ్తల్లి చేతులో ఉన్న బిడ్డను లాక్కెళ్లి బావిలో పడేసిన కోతి.. రక్షించిన డైపర్!

తల్లి చేతులో ఉన్న బిడ్డను లాక్కెళ్లి బావిలో పడేసిన కోతి.. రక్షించిన డైపర్!

తల్లి చేతిలో ఉన్న పసిబిడ్డను కోతి లాక్కెళ్లి బావిలో పడేసిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అయితే విధి వింతగా, ఆ పసిబిడ్డకు వేసిన డైపర్‌నే ప్రాణరక్షకంగా మారింది. నీటిలో మునిగిపోకుండా డైపర్‌ సహాయంతో శిశువు ప్రాణాలతో బయటపడిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఛత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్-చంపా జిల్లా సియోని గ్రామానికి చెందిన సునీత తన ఇంటి వరండాలో 20 రోజుల పసిబిడ్డకు పాలిచ్చుకుంటోంది. ఈ సమయంలో 4 నుంచి 5 కోతులు అక్కడకు వచ్చాయి. ఒక్కసారిగా సునీత చేతిలో ఉన్న పసి పాపను ఒక కోతి లాక్కొని ఇంటి పైకెక్కింది.

దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. బిడ్డను కాపాడేందుకు కోతిని బెదరగొట్టే ప్రయత్నం చేశారు. పటాకులు కాల్చి భయపెట్టేందుకు యత్నించినప్పటికీ, కోతి వెనక్కి తగ్గలేదు. చివరకు చేతిలో ఉన్న పసిబిడ్డను పొరుగింటి ఆవరణలో ఉన్న బావిలో పడేసింది.

ఈ ఘటనను చూసిన గ్రామస్తులు ఆందోళనతో బావి వద్దకు పరుగులు తీశారు. బావిలో పడిన పసిబిడ్డ నీటిపై తేలుతూ కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బిడ్డకు వేసిన డైపర్‌ గాలిని పట్టుకుని తేలేలా చేయడంతో, ఆ చిన్నారి నీటిలో మునగకుండా నిలిచినట్లు గుర్తించారు.

గ్రామస్తులు వెంటనే బకెట్లు, తాళ్ల సహాయంతో 10 నిమిషాల పాటు శ్రమించి ఆ పసిబిడ్డను బావి నుంచి బయటకు తీశారు. కొద్దిగా నీటిని మింగడంతో శిశువు అస్వస్థతకు గురైంది. అయితే అదృష్టవశాత్తు అదే గ్రామంలో ఓ వేడుక కోసం వచ్చిన రాజేశ్వరి అనే నర్సు వెంటనే స్పందించి శిశువుకు సీపీఆర్‌ చేశారు.

ఆ తర్వాత చిన్నారిని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. బావిలో పడినప్పటికీ డైపర్‌ కారణంగా పసిబిడ్డ ప్రాణాలతో బయటపడటం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.

ALSO READ: ప్రియురాలు దూరం పెట్టిందని.. ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు