Tuesday, March 17, 2026
Homeతెలంగాణగుండ్రంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. తన ప్రాణాలు అడ్డువేసి 8 మంది ప్రయాణికులను కాపాడిన...

గుండ్రంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. తన ప్రాణాలు అడ్డువేసి 8 మంది ప్రయాణికులను కాపాడిన లారీ డ్రైవర్లు!

చిట్యాల, క్రైమ్ మిర్రర్:- నల్గొండ జిల్లా, చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ కారులో ఉన్నటువంటి 8 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇక అసలు వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు నుంచి విజయవాడకు బయలుదేరిన ఇన్నోవా కారు తెల్లవారుజామున గుండ్రంపల్లి వద్ద డివైడర్ ను ఢీ కొట్టి బోల్తా కొట్టి హైదరాబాద్ – విజయవాడ వైపు వెళ్లే రోడ్డుపై పడి భారీగా అగ్నిప్రమాదం చేస్తుంది. కారులో 8 మంది ఉండగా హైవేపై వస్తున్న లారీలు పక్కన ఆపి ముగ్గురు రామకృష్ణ, అశోక్, షరీఫ్ లు ఇన్నోవా కార్ డోర్లు తీసి బయట తీసి కాపాడారు. ఇందులో ఒకరు అయ్యప్ప మాల ధరించి ఉన్నాడు. తోటి వారి ప్రాణాలు కాపాడమని అయ్యప్పమాలలో ఉండి వారిని కాపాడి దైవంగా నిలిచాడు. వీరికి తీవ్ర గాయాలయ్యాయి. కాళ్లు చేతులు కాలుతున్న లెక్కచేయకుండా 8 మంది ప్రాణాలు కాపాడడంతో రియల్ హీరోలుగా నిలిచారు. వీరిని చౌటుప్పల్ హాస్పిటల్ నుండి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

Read also : రేపు బీహార్ లో మంత్రి లోకేష్ ప్రచారం!.. ఏం మాట్లాడుతారో అని ఉత్కంఠత?

Read also : నిరాశపరిచిన రాజమౌళి అప్డేట్.. కాపీ అంటూ తిప్పికొట్టిన నెటిజెన్లు?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments