Tuesday, February 24, 2026
Homeతెలంగాణ90 ఏళ్ల వృద్ధురాలిపై యువకుల గ్యాంగ్‌ రేప్‌.. హైదరాబాద్‌లో దారుణం

90 ఏళ్ల వృద్ధురాలిపై యువకుల గ్యాంగ్‌ రేప్‌.. హైదరాబాద్‌లో దారుణం

గ్రేటర్ హైదరాబాద్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. కామం మత్తులో యువకులు వయసు కూడా చూడ లేదు. నడవడానికి కూడా కష్టంగా ఉన్న వృద్ధురాలిపై అఘాయిత్యం చేశారు.అవ్వ వయసు కలిగిన ఆమెపై దారుణంగా వ్యవహరించారు. అత్యంత కిరాతకంగా కామ వాంఛ తీర్చుకున్నారు. వందేళ్లకు దగ్గరలో ఉన్న వృద్ధురాలిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన కలకలం రేపుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బండ మాదారంలో ఈ దారుణ ఘటన జరిగింది.

Read More : అనుమతి ఇచ్చినోళ్లను అరెస్ట్ చేసి.. కట్టిన ట్యాక్స్ తిరిగి ఇచ్చేసి.. ఇండ్లను కూల్చు

బండ మాదారం గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా జీవిస్తోంది. అదే గ్రామానికి చెందిన వెంకట్రావుతో పాటు మరో ఇద్దరు యువకులు ఆమెపై కన్నేశారు. గురువారం రాత్రి వృద్ధురాలు అని చూడకుండా ఆ ముగ్గురు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యులకు విషయం చెప్పడంతో నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా ముగ్గురు నిందితుల్లో ఇద్దరు పరారయ్యారు. వెంకట్రావు పోలీసులకు చిక్కాడు. అతడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికలంగా దుమారం రేపుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments