క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై పదోవతర్గతి విద్యార్దిని ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం హైదరాబాద్‌లోని హబ్సిగూడలో చోటుచేసుకుంది. స్తానీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంగా…
మంగళవారం (నవంబర్ 25, 2025) తెల్లవారుజామున శ్రీ వైష్ణవి అనే 15 ఏళ్ల విద్యార్థిని ఐదంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది అన్నారు. అయితే పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురై ఈ తీవ్ర నిర్ణయం తీసుకుందని తెలిపారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనపై మరింత సమాచారం పోలీసుల విచారణ తర్వాత తెలియాల్సి ఉంది అన్నారు.





