క్రైమ్

సైఫ్ అని తెలియకుండానే పొడిచాడు.. పోలీసుల విచారణలో నిజాలు

దేశంలో సంచలనం స్పష్టించిన బాలీవుడ్‌ టాప్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ పై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని విచారణలో కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. నిందితుడిని బంగ్లాదేశ్‌కు చెందిన 30 ఏళ్ల మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌గా గుర్తించారు. జనవరి 16న బాంద్రాలోని సైఫ్‌ నివాసంలో దాడి చేసిన దుండగుడు తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన అనంతరం బాంద్రా ప్రాంతంలోనే ఉన్న బస్‌ స్టాప్‌లో ఉదయం ఏడుగంటల వరకు పడుకున్నారు. తర్వాత రైలు ఎక్కి వర్లీ కి వెళ్ళినట్టు పోలీసుల విచారణలో తేలింది.

అర్ధరాత్రి దాటాక సైఫ్‌ ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించిన దుండగుడు..ఎనిమిది అంతస్తుల వరకు మెట్ల మార్గంలోనే వెళ్లాడు. తర్వాత డక్ట్‌ ఏరియాకు చేరుకొని పైపు పట్టుకొని 12వ అంతస్తుకు చేరుకున్నాడు. అనంతరం బాత్‌ రూం కిటీకి తెరిచి సైఫ్‌ ఇంటిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో పెనుగులాట చోటుచేసుకొని సైఫ్‌పై దాడి జరిగిందని ని పోలీసులు తెలిపారు. నిందితుడు తొలుత సైఫ్‌ చిన్న కుమారుడు జెహ్‌ ఉంటున్న గదిలోకి వెళ్లాడు. దుండగుడిని చూసిన జెహ్‌ కేర్‌టేకర్‌ కేకలు వేయగా సైఫ్‌ అక్కడికి చేరుకున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య పెనుగులాట జరిగింది. దీంతో సైఫ్‌కు ఆరుచోట్ల కత్తిగాయాలు అయ్యాయి. అనంతరం హుటాహుటిన కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రికి ఆటోలో తరలించారు.

నిందితుడు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించాడని, ఇండియా వచ్చాక విజయ్‌ దాస్‌గా పేరు మార్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దాడి చేసిన నిందితుడు అక్కడున్న ఆయాను డబ్బు డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది. అయితే శబ్దాలు విన్న సైఫ్‌ వెంటనే అక్కడికి చేరుకొని ముందు నుంచి దుండగుడిని గట్టిగా పట్టుకున్నాడు. పెనుగులాటలో సైఫ్‌ వెన్నుపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. ప్రతిఘటించిన సైఫ్.. దుండగుడిని ఫ్లాట్‌లోనే ఉంచి బయట తలుపు వేశాడు. అయితే నిందితుడు తాను వచ్చిన దారి నుంచే జారుకున్నాడు. నిందితుడి బ్యాగ్‌లో నుంచి సుత్తి, స్క్రూడ్రైవర్‌, నైలాన్‌ తాడు ఇతర వస్తువులు గుర్తించామన్నారు పోలీసులు. అయితే దుండగుడికి తాను దాడి చేసిన వ్యక్తి సైఫ్‌ అలీఖాన్‌ అన్న విషయం తొలుత తెలియదని, టీవీల్లో, సోషల్‌ మీడియాలో చూసిన తర్వాతనే అతడికి తెలిసిందన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button