తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి తొలి పుట్టిన రోజు కావడంతో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు హంగామా చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి పార్టీలకు అతీతంగా శుభాకాంక్షలు చెబుతున్నారు లీడర్లు. కూకట్ పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డికి విషెష్ చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కుల గణన సర్వేపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వేకు తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. కానీ బీసీ,ఎస్సి,ఎస్టీ ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీసీ కులగనకు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సర్వేకు సంబంధించి ప్రజల్లో నేతల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు క్యాబినెట్ పైన ఉందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.
సర్వే పేరిట 76 ప్రశ్నలతో కూడిన వివరాలను అడుగుతున్నారని ఆదాయం ఎక్కువగా ఉంటే తెల్ల రేషన్ కార్డుతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలను తీసేసే విధంగా సర్వే ఉంటే మాత్రం సహించేది లేదని వ్యాఖ్యానించారు. హడావిడిగా సర్వే పూర్తి చేయాల్సిన అవసరం లేదని సమయం తీసుకొని సర్వే పూర్తి చేస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. అనంతరం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి ….
విద్యార్థిని తొడ కొరిగిన టీచర్.. ఇంట్లో చెప్తే చంపేస్తా అంటూ బెదిరింపులు
తలకాయే తీసేసారు.. రాహుల్ పర్యటన రోజే దారుణం
భార్యపై కోపంతో కారు యాక్సిడెంట్ చేసిన వ్యాపారి
సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం స్పెషల్ విషెస్