Homeతెలంగాణసంచలనం.. రేవంత్ అభినందన సభకు బీజేపీ మంత్రి

సంచలనం.. రేవంత్ అభినందన సభకు బీజేపీ మంత్రి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం జరుగుతోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అభినందించే సభకు బీజేపీ మంత్రి వస్తుండటం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందన సభకు బీజేపీ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ హాజరవుతున్నారు. ఇందు కోసం పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఈ అభినందన సభను క్షత్రియ సేవా సమితి నిర్వహిస్తోంది. అందుకే క్షత్రియ వర్గానికి చెందిన శ్రీనివాస వర్మ హాజరవుతున్నారు.

Read More : ఆవిడ కోసం పాడు పని.. ముఖ్యమంత్రి పదవికే గండం!

క్షత్రియ సేవా సమితీ సీఎం రేవంత్ రెడ్డికి ఈ అభినందన ఏర్పాటు చేసింది. ఈ సభలో తన ప్రభుత్వం పని తీరును రేవంత్ రెడ్డి చెప్పకుండా ఉండరు. అలాంటి సభకు బీజేపీ కేంద్రమంత్రి వస్తుండటం రాజకీయంగా ఆ పార్టీకి ఇబ్బంది కలిగించేదే. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ టార్గెట్ చేస్తోంది. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడుతోంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అభినందించే సభకు బీజేపీ కేంద్రమంత్రి రావడం కొంత విచిత్రంగా అనిపిస్తోంది. ఇక ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మలు ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది.

Most Popular

Recent Comments