తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు వల్లిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజలకిచ్చిన హామీల అమలు, రుణమాఫీ, 6 గ్యారంటీలపై తెలంగాణలో ప్రజలకు వివరిస్తూ పాదయాత్ర చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. నక్సలైట్ల భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్ లో చోటు కల్పించి సభ్య సమాజానికి ఏ సంకేతాలు పంపుతున్నారని నిలదీశారు. ఆనాడు నక్సలైట్లను కాంగ్రెస్ నాయకులను కూడా దారుణంగా చంపిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు.
కరీంనగర్ లోని మమతా థియేటర్ లో బీజేపీ కార్యకర్తలు, ఏబీవీపీ నాయకులతో కలిసి బండి సంజయ్ ‘జితేందర్ రెడ్డి’ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా తనను కలిసిన సినిమా హీరో రాకేశ్ వర్రె, దర్శక, నిర్మాతలు, సినిమా యూనిట్ సభ్యులను అభినందించారు.తాను చిన్నప్పుడు చదువుకునే సమయంలో దేశం కోసం బలిదానాలు చేసిన ఏబీవీపీ విద్యార్థుల చరిత్రను తెలుసుకున్న. వాళ్ల త్యాగాలు వ్రుధా కాకుండా దేశం కోసం పనిచేయాలని నేను కూడా ఏబీవీపీలో పనిచేసి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఆనాడు ఒక్క కార్యకర్త బలిదానమైతే… వందల మంది కార్యకర్తలు పుట్టుకొచ్చారు.. జితేందర్ రెడ్డి బలిదానంతో వేలాది మంది పుట్టుకొచ్చారు. నక్సలైట్లు చంపుతారని తెలిసినా ఏనాడూ ఏ కార్యకర్త భయపడలేదు. నమ్మిన సిద్ధాంతం, ధర్మం కోసం పోరాడిన చరిత్ర ఏబీవీపీదే అన్నారు. మంచి ఆలోచనలున్న ప్రతి ఒక్కరూ, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్న వాళ్లంతా జితేందర్ రెడ్డి సినిమాను చూడాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టు భావజాలమున్న వాళ్లకు విద్యా కమిషన్ లో చోటు కల్పించడం సిగ్గు చేటు అన్నారు బండి సంజయ్. నక్సలైట్ భావజాలమున్న వారివల్లే ఎంతో మంది జితేందర్ రెడ్డి లాంటోళ్లు చనిపోయారని.. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏ సంకేతాలు పంపుతోంది? నక్సలైట్ల చేతిలో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బలైపోయారు. విద్యా కమిషన్ లో నక్సలైట్ భావజాలమున్న వాళ్లను విద్యా కమిషన్ లో చోటు కల్పించడం ద్వారా వారి త్యాగాలను కూడా వ్రుధా చేశారు. ఇది ఏ మాత్రం మంచి పద్దతి కాదు అన్నారు. జాతీయ వాదులు, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్లంతా నూతన విద్యా కమిషన్ ను రద్దు చేయాలని కోరుతున్నారని చెప్పారు. రేవంత్ సర్కార్ కూడా తక్షణమే కమిషన్ ను రద్దు చేసి కొత్త వారికి ఛైర్మన్, సభ్యులుగా అవకాశం కల్పించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
అబద్దాలంటేనే కాంగ్రెస్ పార్టీ. మోసాలు, అబద్దాలకు కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. మహారాష్ట్రకు పోయి అబద్దాలు చెప్పడం కాదా? తెలంగాణలో తిరిగి ఆ విషయాలు చెప్పే దమ్ముందా? కాంగ్రెస్ పార్టీ నిజంగా 6 గ్యారంటీలను అమలు చేసి ఉంటే.. కోట్లు ఖర్చు పెట్టి మహారాష్ట్రలో ఇచ్చిన యాడ్స్ లో ఆ విషయం ఎందుకు ప్రస్తావించలేదు? ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అమలు చేశామని చెప్పిన రేవంత్ రెడ్డి… ఇంకా 20 లక్షల మంది రైతులకు నయాపైసా రుణమాఫీ కాలేదని చెప్పే దమ్ముందా? మహిళలకు తులం బంగారం, స్కూటీ, నెలనెలా రూ.2500లు, నిరుద్యోగులుకు రూ.2 లక్షల మాఫీ, విద్యార్థులకు రూ5 లక్షల భరోసా కార్డు, వ్రుద్దులకు నెలనెలా రూ.4 వేల ఫించన్, పేదలందరికీ ఇండ్లు ఇచ్చారా? ఇవేమీ అమలు చేయకుండా మహారాష్ట్రకు పోయి పచ్చి అబద్దాలు చెప్పడం సిగ్గు చేటు… మేం కూడా మహారాష్ట్రలో తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ బండారాన్ని బయటపెడతాం.
6 గ్యారంటీలు, రుణమాఫీపై నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ ప్రభుత్వంపట్ల విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. అందుకే నివేదికను బయటపెట్టేందుకు కూడా రేవంత్ సర్కార్ వెనుకాడుతోంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, కర్నాటక, తెలంగాణలో ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీకి హర్యానాలో కర్రు కాల్చి వాతపెట్టారు. ఈసారి మహారాష్ట్రలో కూడా అదే జరగబోతోంది.
బీజేపీపై యుద్దం చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు.. దేనికోసం యుద్దం చేస్తారు? ఈ దేశంలో 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్నందుకా? 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చినందుకా? ట్రైబల్ వర్శిటీ ఇచ్చినందుకా? ట్రిబుల్ ఆర్ రోడ్డుకు నిధులు ఇస్తున్నందుకా? స్మార్ట్ సిటీ నిధులు ఇస్తున్నందుకా? గ్రామాలకు నిధులు ఇస్తున్నందుకా? జాతీయ రహదారుల కోసం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నందుకా?
కేసీఆర్ సర్కార్ తెలంగాణలోని ఒక్కో కుటుంబంపై లక్ష రూపాయలకు పైగా అప్పు చేసి దోచుకుంటే… కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు మించి అప్పులు చేస్తూ ప్రజలను బిచ్చగాళ్లను చేస్తోంది. తెలంగాణలో ప్రజలు కేసీఆర్ ను ప్రజలెప్పుడో మర్చిపోయారు. అందుకే ఫాంహౌజ్ కే పరిమితమైండు. ఎన్నికలప్పుడే బయటకొచ్చే కేసీఆర్ లాంటి నాయకుడిని తెలంగాణ సమాజం లీడర్ గా భావించదు. వరదలొస్తే బయటకు రాలే. రైతులు అరిగోస పడుతుంటే రాలే. నిరుద్యోగులు రోడ్డున పడితే రాలే.. 6 గ్యారంటీలను అమలు చేయకుండా మోసం చేస్తే రాలే.. కానీ కేటీఆర్ బామ్మర్థి రేవ్ పార్టీలో దొరికితే మాత్రం డీజీపీకి ఫోన్ చేస్తడు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఇక ఎన్నడూ నమ్మదు. కేసీఆర్ పాలనను తలుచుకుంటేనే ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నయ్. కాంగ్రెస్ కూడా అంతకుమించి దారుణమైన పాలన చేస్తోంది. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి మీద పడ్డట్లయింది. ఈసారి అందుకే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలంతా బీజేపీకి ఓటేసి గెలిపించేందుకు సిద్ధమయ్యారు.
రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచులను, ఆటో డ్రైవర్లను, రైతుల వద్దకు వెళ్లి కాంగ్రెస్ గురించి అడిగితే ఆ పార్టీ చేసిన మోసాలను చెబుతారు. ముఖ్యంగా మాజీ సర్పంచులారా… మీ గుండెపై చేయి వేసుకుని ఆలోచించండి. ఏ పార్టీకి ఓట్లేస్తే గ్రామాలకు నిధులొస్తాయి? ఏ పార్టీకి ఓట్లేస్తే మీకు న్యాయం జరుగుతుందో ఆలోచించండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని కోరుతున్నాఅని సంజయ్ అన్నారు.
మరిన్ని వార్తలు చదవండి ..
కుల గణన సర్వే తుస్స్.. సీఎంను తిడుతూ తరమికొడుతున్న జనాలు
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?
పిచ్చోళ్లు గుడులపైనే దాడులు చేస్తరా.. రేవంత్ కు సంజయ్ వార్నింగ్
ఒరేయ్ కేటీఆర్.. బుల్డోజర్ తొక్కిస్తా.. రెచ్చిపోయిన కోమటిరెడ్డి
టీటీడీ జోలికొస్తే ఖబర్దార్.. ఒవైసీకి రాజాసింగ్ వార్నింగ్
20 నిమిషాల్లో బెజవాడ టు శ్రీశైలం.. ఆకాశంలో విహరిస్తూ సీ ప్లేన్ జర్నీ