Sexual minister : ఆయనో మంత్రి. తరచూ తిరుపతి పర్యటనకు వెళ్తుంటారు. దేవుడంటే భక్తి అని అనుకుంటారేమో.. కానేకాదన… రక్తిలో మునిగి తేలుతారట అమాత్యులవారు. స్టార్ హోటల్స్‌లో రూమ్‌లు… పక్కన అమ్మాయిలు లేనిదే ఆయన పర్యటన పూర్తవదట. ఆయన బాగోతరం చూడలేక అందరూ కళ్లు మూసుకుంటారట. ఇంతకీ ఆ రసిక మంత్రివర్యులు ఎవరు…? ఆయన రాససీలల గుట్టును సొంత పార్టీ నేతలనే ఎందుకు బయటపెట్టారు.
టీడీపీ నాయకులు కట్టు తప్పుతున్నారు. సీఎం చంద్రబాబు వారిని పదే పదే వారిస్తున్నా… ఏ మాత్రం తగ్గడంలేదు. అధికారం ఉన్నప్పుడే అనుభవించాలనే అన్న స్లోగన్‌ను పక్కాగా ఫాలో అవుతున్నట్టు ఉన్నారు. అవినీతిలోనే కాదు అతివల విషయాల్లోనూ వారికి వారే సాటని చాటిచెప్తున్నారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయని. మహిళలతో వివాహేతర సంబధాలు, వేధింపులు… ఇలా ఎన్నో. దీంతో.. సీఎం చంద్రబాబు వరుస హెచ్చరికలు చేశారు. ఎమ్మెల్యేల బాధ్యతను మంత్రులకు అప్పగించారు. అయితే… ఇక్కడ కంచే చేను మేస్తోంది. మంత్రి పదవిలో ఉన్న నాయకుడే… రాసలీలల్లో మునిగితేలుతున్నారు. అది కూడా పవిత్రతమైన తిరుపతిలో. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… ప్రత్యర్థులు కాదు.. సొంత పార్టీ నేతలే ఆయన వేషాలు చూడలేక… కడపలో దాచుకోలేక.. కక్కేశారు. మీడియా ముందే.. ఆ మంత్రి గుట్టు విప్పారు.
మంత్రి గారి రాసలీల బాగోతం బయటపెట్టింది ఇంకెవరో కాదు టీడీపీ అధికార ప్రతినిధి ఎన్.బి. సుధాకర్‌రెడ్డి. ఓ టీవీ ఛానెల్ డిబేట్లో పాల్గొన్న ఆయన… మంత్రిగారి సరసాలను చూడలేకపోతున్నానంటూ.. సంచనల విషయాలు బయటపెట్టారు. తాను తిరుపతిలో ఉంటున్నా.. అక్కడికి వచ్చే టీడీపీ నేతల్ని కలవడమే మానేశానన్నారు. ఎందుకు వారి తీరు అంత అసహ్యంగా ఉందంటున్నారు సుధాకర్‌రెడ్డి. మంత్రిగాని సరసాల గురించి కూడా పూస గుచ్చినట్టు చెప్పేశారు. అయితే… ఆ మంత్రి పేరు మాత్రం బయటపెట్టలేదు. తరచూ తిరుపతికి వస్తూ.. స్టార్ హోటల్స్‌లో దిగుతారని… ఆయన పక్క గదిలో ఎవరుంటారో అందరికీ తెలుసన్నారు. అవన్నీ చూసి భరించలేక వారికి దూరంగా ఉంటున్నానని చెప్పారాయన. టీడీపీ అధికార ప్రతినిధి… టీవీ ఛానెల్ డిబేట్లో ఒక మంత్రిపై ఇలాంటి ఆరోపణలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఎవరా మంత్రి..? అంటూ చర్చ మొదలైంది.
టీడీపీ అధికార ప్రతినిధి ఎన్.బి. సుధాకర్‌రెడ్డి ఆరోపణలపై… వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆ మంత్రి తిరుపతికి వచ్చి పెద్ద పెద్ద హోటళ్లు బుక్ చేసుకుని… పక్క రూములు తనతో వచ్చిన మహిళలకు బుక్ చేసి… వారితో రాసలీలల్లో మునిగితేలుతున్నారన్నారు. ఆ మంత్రి అవినీతి, దురాగతాలు రాష్ట్రమంతా ఉన్నాయని… మూలాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో కూడా ఆయన చేస్తున్న రాసలీలలు అన్నీ ఇన్నీ కావని చెప్పారు. చివరకు పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కూడా ఇంత హేయంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి పవిత్రతను టీడీపీ నేతలు భ్రష్టుపట్టిస్తున్నారని ఫైరయ్యారు. టీడీపీలో ఇలాంటి ఘోరాలు… మహిళల పట్ల అసభ్యకరమైన చేష్టలు చేస్తుంటే.. అధిష్టానం ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు భూమన. ఆ మంత్రిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇంతకీ ఆ రాసలీల మంత్రి ఎవరు..? పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రాన్ని కూడా అపవిత్రం చేస్తున్నారంటే… ఈ విషయంలో సీరియస్‌గా తీసుకోవాల్సి అవసరం ఉంది.. లేదంటే అధికార పార్టీ నేతల ఆగడాలు మరింత శృతిమించే ప్రమాదం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు.