
మునుగోడు, క్రైమ్ మిర్రర్ :- మునుగోడు నియోజకవర్గ, కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ గా మునుగోడు నియోజకవర్గంలోని వెల్మకన్నే గ్రామానికి చెందిన ఆవుల ప్రేమ్ సుందర్ ను నియమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నం అశోక్ గౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనను లీగల్ సెల్ తో పాటు మానవ హక్కుల మరియు సమాచార చట్టాలకు చైర్మన్ గా వ్యవహరించాలని వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రేమ్ సుందర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య నరసింహ మరియు న్యాయవాదులు జి. శ్రీనివాస్ చక్రవర్తి,ముక్కరం శ్రీను, కట్ట అనంతరెడ్డి, మామిడి బాలయ్య, వేములకొండ సత్తయ్య, గిరి లింగయ్య, పిట్టల సతీష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
Read also : సిపిఎం ఆధ్వర్యంలో గెలిచిన అభ్యర్థులకు సన్మానం
Read also : నేటి తెలంగాణ రాష్ట్ర ప్రధాన వార్తలు..!





