
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- ప్రతిసారి ఏ కార్యక్రమం జరిగిన పూలు అమ్మిన లేదా పాలు అమ్మిన అంటూ చెప్పే మల్లారెడ్డి ఎన్నో భూకబ్జాలు చేశారు అని తాజాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారు అని అన్నారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా కవిత మేడ్చల్ నియోజవర్గంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగానే ఎమ్మెల్యే మల్లారెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిసారి పాలు లేదా పూలు అమ్మిన అంటూ చెప్పే మల్లారెడ్డి ఎన్నో ఎకరాల భూమిని కబ్జా చేశారు అన్న విషయం మీకు చెప్పారా అని అన్నారు. అతను రాజకీయంలో ప్రజలకు చేసింది ఏమీ లేదు అని కేవలం తన కాలేజీలు అలాగే యూనివర్సిటీలు మాత్రమే బాగు చేసుకున్నాడు అని కవిత తీవ్రంగా విమర్శించారు. అతనిది మాత్రం ఎటువంటి రిజర్వేషన్ కావాలన్నా క్షణాల్లోనే అయిపోతుంది కానీ.. సామాన్య ప్రజలకు మాత్రమే ఎందుకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి అని కవిత ప్రశ్నించారు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాలపై అవగాహన కలిగి ఉండాలి.. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైనా అభివృద్ధి జరిగింది కానీ ఆ తర్వాత నుంచి ఎటువంటి అభివృద్ధి ఇక్కడ నోచుకోలేదు అని తెలిపారు. కాబట్టి ఓటు వేసే ముందు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించి వేయాలి అని సూచించారు.
Read also : మనిషి ప్రాణం తీసిన చికెన్ ముక్క.. జాగ్రత్త!
Read also : 25 కాదు..12నే విడుదల చేయాలని బాలకృష్ణ ఫ్యాన్స్ డిమాండ్!





