క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఎమ్మెల్యేల వలసలకు అడ్డుకట్ట వేయలేక సమతమవుతున్న మాజీ సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఇదివరకే గుడ్‌బై చెప్పిన రాజ్యసభ ఎంపీ కే కేశవరావు ఈ రోజు (బుధవారం) హస్తం పార్టీలో చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి కేశవరావుని ఆహ్వానించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపదాస్ మున్షీ, పార్టీ సీనియర్ కేసీ వేణుగోపాల్, మధు యాష్కీ గౌడ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చనిపోయే వరకూ కాంగ్రెస్ లోనే ఉంటాను. కాంగ్రెస్ తనకు సొంత ఇల్లులాంటిదని, తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారు. నేను కూడా నా సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరుతున్నాను. 53 ఏళ్లు కాంగ్రెస్‌లో పని చేశాను. బీఆర్ఎస్‌లో నేను పని చేసింది కేవలం పదేళ్లే అని అప్పట్లో కేకే అన్నారు. కాగా కేకే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే ఆయన కుమార్తె విజయలక్ష్మి కూడా హస్తం పార్టీలో చేరారు. ఆయన కేకే కొడుకు మాత్రం బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని చెప్పారు.
ఇవి కూడా చదవండి :
- గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ ను సందర్చిన ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి,మాజీ చైర్మన్ రామ్ నర్సింహా గౌడ్..
- నేడు పండుగ రోజు.. సత్ప్రవర్తన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 213 మంది ఖైదీల విడుదల!!
- సెక్రటేరియట్‌లో మంత్రి కోమటిరెడ్డి ఆకస్మిక తనిఖీ.. ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి !!
- మియాపూర్‌లో దారుణం.. యువతిపై ఇద్దరు అత్యాచారయత్నం, కేసు నమోదు!!
- పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు.. బీఎన్‌ఎస్ యాక్ట్‌లో కేసు నమోదైన తొలి ఎమ్మెల్యేగా రికార్డు!!