తెలంగాణ

ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు.. హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోని 30 వేలకు పైగా అభ్యర్ధులు!!

క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : డీఎస్సీ అభ్యర్థుల్లో ఆగ్రహ జ్వాల ఇంకా చల్లారలేదు. పరీక్షలు వాయిదా వేయాలని ఎంతపోరు పెట్టినా సర్కార్ వెనక్కితగ్గలేదు. దీంతో గురువారం నుంచి పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా యథాతథంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 7.30 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందే ఎగ్జామ్‌ సెంటర్ల గేట్లను మూసివేశారు. ప్రతిఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపలికి అనుమతించారు. అయితే సర్కార్‌ తీరుపై ఆగ్రహించిన వేలాది మంది నిరుద్యోగులు.. తమ జీవితాలను పణంగా పెట్టేందుకూ వెనుకాడలేదు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా.. ఏకంగా 31,105 మంది అభ్యర్ధులు తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోలేదు.

Read Also : కేసీఆర్ మెప్పుకోసమే ఈ ప్రోటోకాల్ డ్రామా.. కాంగ్రెస్ నేతలు

వీరంతా పరీక్షలు రాయకుండా తమ నిరసనను వ్యక్తం చేసేందుకు సిద్ధమయ్యారు. 11,056 డీఎస్సీ పోస్టులకి మొత్తంగా 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జున్ 11వ తేదీనే అధికారులు తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచగా.. బుధవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 2,48,851 మంది మాత్రమే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. 30 వేలకు పైగా అభ్యర్ధులు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా పరీక్షలు రాయకుండా ఆందోళన చేపట్టారు. మరోవైపు వందలాదిమంది డౌన్‌లోడ్‌ చేసుకున్న తమ హాల్‌టికెట్లను కాల్చివేశారు. ప్రిపేరేషన్‌కు తగిన సమయం ఇవ్వలేదని, తాము పరీక్ష రాయబోమంటూ మండిపడ్డారు. అయితే మరోవైపు డీఎస్సీ వాయిదా వేయాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ నేడు విచారణకు రానుంది.

ఇవి కూడా చదవండి : 

  1. యూనియన్ బ్యాంకు మేనేజర్ అజయ్ ఘరానా మోసం..!
  2. సైబర్ నెరగాళ్ళ లింకు ఓపెన్ చేశారో…. ఎకౌంట్లో పైసలు మాయం….
  3. చామలపల్లిలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దంపతులు…
  4. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టండి…సీఎం రేవంత్ రెడ్డి
  5. డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ సోదరుడు అరెస్ట్..

Back to top button