తెలంగాణ
Trending

నాంపల్లి రెవెన్యూలో దసరా ఆఫర్లు..

  • పౌతికి, సేల్ డిడికి డిస్కౌంట్ లు ఇస్తున్న ధోరణి..
  • చిన్నాపెద్ద అనే తేడానే లేదు అందరూ చేతి తడపాల్సిందే..
  • ధరణి ఆపరేటర్ తో సహా ముడుపుల జాతరే..
  • బహిర్గతంగానే లంచాలు అడుగుతున్న చిన్న జమిందార్.
  • 500 లకు ఏమోస్తుంది నేను సంతకాలు చెయ్యను, పహాణిలపై అలక పూనిన అయ్యగారు..
  • తప్పుకింతంటూ వెతికి మరీ, రేట్ నిర్ణయిస్తున్న సిబ్బంది..
  • అవినీతి రొంపిలో నాంపల్లి రెవెన్యూ..

నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): అందరూ శాఖహారులే, మరి రొయ్యల ముల్లేడవాయే అనే పాటకు ఊపిరి పోస్తున్నారు నాంపల్లి మండలం రెవెన్యూ అధికారులు.. తప్పు చెయ్యడం కూడా తమ హక్కే అన్న విధంగా, ఏమాత్రం భయపడకుండా లంచాలు అడుగుతున్నారు నాంపల్లి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది.. పౌతి నుండి మొదలుకొని సేల్ డిడి వరకు ఆ కార్యాలయంలో రేట్లు నిర్ణయించి ఉంటాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు.. బ్యాంక్ లోన్ ఉందా..? అయితే రిజిస్ట్రేషన్ చెయ్యాలంటే డబుల్ ఛార్జ్ కట్టాల్సిందే. పహాణిలలో సంతకాలకు సైతం చిన్న జమిందార్ కి శాఖపొయ్యాల్సిందేనంటున్నారు స్థానికులు.. ఏదో ఒక కారణం చెబుతూనే పైసలు దండుకునే పనిలో ఉన్నారు రెవెన్యూ స్టాఫ్..

రానున్న మరో క్రైమ్ మిర్రర్ కధనం ద్వారా ఆ అధికారి, సిబ్బంది వివరాలతో మీ ముందుకు…

నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది..

Spread the love
Back to top button