తెలంగాణ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణలో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని డిసైడ్ అయిన ప్రభుత్వం.. ఈ మేరకు 2024, అక్టోబర్ 29న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఫామ్‌ను రిలీజ్ చేసింది. ఈ ఫామ్‌లో అధికారులు సేకరించనున్న వివరాలకు సంబంధించిన ప్రశ్నలను ప్రభుత్వం వెల్లడించింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా అధికారులు మొత్తం రెండు పార్టీలుగా వివరాలు సేకరించనున్నారు.
—-
కుటుంబ యజమాని కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు అధికారులు నమోదు చేసుకోనున్నారు. ప్రతి కుటుంబం యొక్క సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులానికి సంబంధించిన వివరాలు అధికారులు సేకరించనున్నారు. ఈ సర్వేలో కుటుంబ సభ్యులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలతో పాటు వారి భూములు, రిజర్వేషన్లు, రాజకీయ నేపథ్య వివరాలను సైతం అధికారులు అడిగి తెలుసుకోనున్నారు.
2024, నవంబర్ 6వ తేదీ నుండి ఈ సర్వే మొదలు కానుంది. రాష్ట్ర ప్రణాళిక శాఖకు ఈ సర్వే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
0 5,117 Less than a minute