Homeవైరల్థియేటర్లలో 'ఇరుముడి' భక్తి పారవశ్యం: స్క్రీన్ ముందే హారతులు, భజనలతో ప్రేక్షకుల సంబరాలు

థియేటర్లలో ‘ఇరుముడి’ భక్తి పారవశ్యం: స్క్రీన్ ముందే హారతులు, భజనలతో ప్రేక్షకుల సంబరాలు

క్రైమ్ మిర్రర్, సినిమా :- రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ థియేటర్లను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మారుస్తోంది. ఈ సినిమాలో హీరో అయ్యప్ప మాల ధరించి కనిపించడం, అలాగే భక్తిరస పూరితమైన సన్నివేశాలు, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు భక్తి పారవశ్యంతో ఊగిపోతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సినిమా థియేటర్లలో సాధారణంగా కనిపించే కోలాహలానికి భిన్నంగా, ‘ఇరుముడి’ ప్రదర్శితమవుతున్న థియేటర్లలో భక్తి వాతావరణం నెలకొంది. కొందరు ప్రేక్షకులు ఏకంగా తెర ముందుకు వెళ్లి హారతులు ఇస్తుండటం విశేషం. మరికొందరు తమ సీట్లలోనే కూర్చుని భజనలు చేస్తూ, దేవుడి నామస్మరణతో థియేటర్‌ను మారుమ్రోగిస్తున్నారు.ముఖ్యంగా సినిమాలో వచ్చే ‘మల్లెపూల పల్లకి’ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ పాట సమయంలో అభిమానులు తమ సీట్లలోంచి లేచి, బిగ్ స్క్రీన్ వద్దకు వెళ్లి డ్యాన్సులు చేస్తూ థియేటర్ల వద్ద పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఒక మాస్ హీరో సినిమాలో భక్తి ఎలిమెంట్స్‌కి ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం, ప్రేక్షకులు థియేటర్లలోనే పూజలు చేయడం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ‘ఇరుముడి’ కేవలం సినిమాగా కాకుండా, ప్రేక్షకులకు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతోందని చెప్పవచ్చు.

ఓటీటీలోకి సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్.. అప్పుడే స్ట్రీమింగ్!

భర్తను కాపాడేందుకు చివరి వరకు పోరాటం.. నటి మీనా ఎమోషనల్ కామెంట్స్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు