తెలంగాణ

తీన్మార్ మల్లన్నను పండబెట్టి తొక్కుతం

తెలంగాణలో కొన్ని రోజులుగా సంచలనంగా మారారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. అధికార పార్టీ నేతగా ఉంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా రెడ్డి లీడర్లను టార్గెట్ చేశారు. రెడ్డి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఏ రేంజ్ లో తిడుతున్నారు తీన్మార్ మల్లన్న. రెడ్ల సంగతి తేలుస్తానని చెబుతున్నారు. రెడ్ల ఓట్లు తనకు అవసరం లేదంటున్నారు తీన్మార్ మల్లన్న. సీఎం రేవంత్ రెడ్డిని కూడా వదలడం లేదు. రేవంత్ రెడ్డి కేవలం రెడ్లకు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. తీన్మార్ మల్లన్న తీరు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది.

రెడ్లను తీన్మార్ మల్లన్న టార్గెట్ చేయడంతో అతనిపై మండిపడుతోంది రెడ్డి సామాజిక వర్గం. తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేస్తోంది.తీన్మార్ మల్లన్నను పండబెట్టి తొక్కుతామని రెడ్డి జాగృతి సభ్యుడు దర్గ దయాకర్ రెడ్డి హెచ్చించారు. మొన్నటి వరకు వెలుమల తిట్టి బతికినవ్.. ఇప్పుడు మా రెడ్లని తిట్టి బతుకుతావారా అంటూ విరుచుకుపడ్డారు. మా రెడ్ల జోలికి వస్తే పండబెట్టి తొక్కుతామని ఓపెన్ గానే బెదిరించారు.

మరోవైపు రెడ్డి సామాజికవర్గం తనను టార్గెట్ చేసినా తీన్మార్ మల్లన్న ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రెడ్లంతా కలిసి వచ్చినా తన వెంటుక్ర కూడా పీకలేరని సవాల్ విసురుతున్నారు. దీంతో తీన్మార్ మల్లన్న, రెడ్డ యుద్ధం ఎటు వైపు దారి తీస్తుందోనన్న ఆందోళన కాంగ్రెస్ వర్గాల్లో కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button