క్రైమ్ మిర్రర్,సినిమా న్యూస్:- ఈరోజు శోభన్ బాబు, హీరోయిన్ మానస వారణాసి కలిసిన నటించినటువంటి ఫ్రెండ్లీ కపుల్ మూవీ ప్రమోషన్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొన్నారు. ఇందులో భాగంగానే హీరో ప్రభాస్ తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నప్పుడు విజయవాడలో తిన్న పునుగులు ఇప్పటికీ గుర్తుకు వస్తున్నాయి అని.. ఎప్పుడైనా సరే అక్కడికి వెళ్తే వెంటనే పునుగులు తినే వాడినని తన ఇష్టమైన స్నాక్స్ గురించి తెలిపారు. తనకు ప్రమోద్ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నట్లు.. చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్ లో వాళ్ళింటికి వెళ్లి పునుగులు తినేవాడినని గుర్తు చేసుకున్నారు. విజయవాడలో తిన్నటువంటి పునుగులు ఇప్పటివరకు నా జీవితంలో ఎక్కడ కూడా తినలేదు అని.. చెప్తుంటే ఇప్పుడు నోరూరుతుంది కానీ.. అక్కడికి వెళ్ళినప్పుడే తినాలనుకుంటా అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ సినిమాలో భాగంగా బిజీబిజీగా గడుపుతూ ఫ్యాన్స్ కు కాస్త దూరంగా ఉన్నారు. ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగానే డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి కూడా ప్రభాస్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరోలోని మాస్ ను, వారి మేనరిజాన్ని బయటకు తీయాలి అంటే కచ్చితంగా పూరి జగన్నాథ్ వలనే సాధ్యమవుతుంది అని తెలిపారు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈరోజు మళ్ళీ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం పట్ల ప్రభాస్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. కాగా రెండు రోజుల క్రితం బిల్ గేట్స్ కూడా విజయవాడ పునుగులు టేస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే చాలామంది అభిమానులు విజయవాడలోని పునుగుల కొట్టుకు వెళ్లి మరి ఒకసారి టేస్ట్ చేస్తున్నారు.
