నల్లమల అటవీ ప్రాంతంలో చిక్కుకున్న డిండి మండలం దెయ్యంగుండ్లకు చెందిన 10 మందిని కాపాడారు నల్గొండ జిల్లా పోలీసులు.నిన్న సాయంత్రం 6 గంటలకు సమాచారం అందినే వెంటనే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు అప్రమత్తమైన జిల్లా పోలీస్. రాత్రి నుంచి డ్రోన్ కెమెరా ద్వారా గాలింపు చర్యలు చేపట్టి రిస్క్యూ చేసి బాధితులను కనిపెట్టారు పోలీసులు. డిండి నదిలో చిక్కుకున్న 10 మంది వ్యక్తులకు డ్రోన్ ద్వారా ఆహారం పదార్థాలు అందజేసి బాధితులకు భరోసానిచ్చారు.
రాత్రి సమయంలో ఎక్కువ వరద ఉధృతి ఉండటం వలన ఈరోజు ఉదయం బాధితులను తాడు ద్వారా నాగర్ కర్నూల్ పోలీసుల సహాయంతో బయటికి తీసుకొచ్చారు పోలీసులు. డిండి (మం)దెయ్యం గుండ్లకు చెందిన వీళ్లంతా కృష్ణా నదికి ఉపనది అయిన దిండి నదిలో వీరంతా ఉదయం చేపలు పట్టడానికి వెళ్లారు. అయితే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు, నదీ వరదను అంచనా వేయలేక వారంతా నదిలోనే పెద్ద బండరాయి మీదికి చేరుకొని, తమని కాపాడమని ఆర్తనాదాలు చేశారు.
దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం వారికి ఆహార పోట్లాలు అందించేందుకు ప్రయత్నించారు అచ్చంపల్లి పోలీసులు. వారిని రక్షించడానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయం కోరారు. అయితే తెల్లవారుజామున వరద ఉధృతి కొంత తగ్గడంతో తాళ్ల సాయంతో బయటికి తీసుకొచ్చారు.