ఆంధ్ర ప్రదేశ్సినిమా

టార్గెట్ సీఎం.. గేమ్ ఛేంజర్ ట్రైలర్ అదుర్స్.. పుష్ప రికార్డులు బ్రేకే!

మెగా హీరో, గ్లోబల్ స్టార్ రాంచరణ్.. సన్సెషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ ట్రైలర్ వచ్చేసింది. సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుండగా.. పది రోజులు ముందుగా ట్రైలర్ విడుదల చేశారు. గేమ్ ఛేంజర్ ట్రైలర్ దుమ్ము రేపుతోంది. రెండు పాత్రలలో రాంచరణ్ అదరగొట్టారు. హెలికాప్టర్ నుంచి లుంగీలో రామ్ చరణ్ దిగే షార్ట్ గుస్ బంప్స్ తెప్పిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ లో అంజలితో సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మీద అంచనాలను ట్రైలర్ భారీగా పెంచేసింది.

ట్రైలర్ లో శంకర్ మార్క్ మూవీ మేకింగ్ అర్గమవుతోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. హీరో రామ్ చరణ్ లుక్ కూడా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తోంది. ఒక ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారి ఏ రేంజ్ లో పవర్ఫుల్ అనేది ఈ సినిమాలో రామ్ చరణ్ చూపించబోతున్నాడు. సినిమాటోగ్రఫీ కూడా ఒక వేరే లెవెల్ లో ఉంది. కమర్షియల్ సినిమా అంటే ఇలా ఉండాలి అన్నట్టు ట్రైలర్ ను కట్ చేశారు మేకర్స్.శంకర్ మూవీ అంటేనే ఏదో ఒక సోషల్ ఎలిమెంట్ ఉంటుందనే అంచనాతో ఉంటారు. అంచనాలకు తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమాలో అవినీతి మీద అలాగే బ్లాక్ మనీ మీద ఒక ఐఏఎస్ చేసే పోరాటాన్ని చూపిస్తున్నట్టు క్లియర్ గా అర్థమైంది. కామెడీ కూడా ఓ రేంజ్ లోనే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. సునీల్ కామెడీ గురించి జస్ట్ ఇంట్రో ఇచ్చారు. ఇక ఎస్ జె సూర్య విలనిజం కూడా సినిమాకు హైలైట్ గా ఉందనే టాక్ వస్తోంది.

ఒక ఐఏఎస్ ముఖ్యమంత్రితో పోరాటం చేయబోతున్నట్టు… ఈ ట్రైలర్ లో చూపించారు. నువ్వు ఐదేళ్లు మాత్రమే మంత్రివి నేను చచ్చిపోయే వరకు ఐఏఎస్ అంటూ రాంచరణ్ నోటు నుంచి వచ్చిన డైలాగ్ పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేయడం ఖాయం. అలాగే ట్రైలర్ స్టార్టింగ్ లో ఉన్న ఒక డైలాగ్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్ కు పిచ్చపిచ్చగా నచ్చేసింది. 100 ముద్దలు తిన్న ఏనుగు ఒక ముద్ద తినకపోతే వచ్చే నష్టమేమీ లేదని ఆ ఒక్క ముద్దతో ఎన్నో ప్రాణులు బతుకుతాయి అంటూ అవినీతి సొమ్ము గురించి క్లారిటీ ఇచ్చాడు. సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. ఆ లుక్కులో కూడా ఈ మెగా హీరో పక్కాగా ఒదిగిపోయాడు. దీనితో జనవరి 10 కోసం వెయిటింగ్ భీభత్సంగా స్టార్ట్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్ లొకేషన్స్ అన్నీ కూడా మాస్ ఆడియన్స్ కు పక్కాగా నచ్చుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button