Monday, February 23, 2026
Homeక్రైమ్గోషామహాల్‌లో దాడులు.. పోలీసులపై రాజాసింగ్ సీరియస్

గోషామహాల్‌లో దాడులు.. పోలీసులపై రాజాసింగ్ సీరియస్

మిలాద్ ఉల్ నబీ ఊరేగింపు సందర్భంగా మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధి జింసి చోరాహ వద్ద ఇరువర్గాల మధ్య భారీ గొడవ జరిగింది. ఇద్దరు యువకులు ఒక మహిళ పై దాడి చేసి పరారయ్యారు.  ఈ ఘటనలో ఒక యువకుని కాలు ఫ్రాక్చర్ అయింది.

సంఘటన స్థలంలో వందలాది సంఖ్యలో గుమిగూడిన ఒక వర్గానికి చెందిన సభ్యులు. వారందరిని చెదరగొట్టిన పోలీసులు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సౌత్ వెస్ట్ జోన్ డిసిపి ఆధ్వర్యంలో భారీగా మోహరించిన పోలీసులు.. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మిలాద్-ఉన్-నబి ఊరేగింపు సందర్భంగా గోషామహల్ నియోజకవర్గం పలు స్థానాల్లో ఓ వర్గంపై దాడులు చేసిన వారిపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కు డిమాండ్ చేశారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. తన నియోజకవర్గంలో ఉన్న వారి పై వందలాది సంఖ్యలో వచ్చి స్థానికుల పై దాడులు చేసిన ఘటనను ఆపడంలో పోలీసులు విధలమయ్యారని ఆరోపించారు.ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. తమ కార్యకర్తలే కొంత మంది నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారని చెప్పారు. వారి పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments