
జీహెచ్ఎంసీ పునర్విభజనలో మహానగరంలో గతంలో ఉన్న 150 డివిజన్లకు కొత్తగా మరో 150 డివిజన్లు ఏర్పాటయ్యాయి. కూకట్ పల్లి నియోజకవర్గంలో గతంలో 8 డివిజన్లు ఉండగా.. ఇప్పుడు 15 వచ్చాయి. దీంతో కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు యువ నేతలు సిద్ధమవుతున్నారు. తొలి ప్రయత్నంలోనే బల్గియాలో అడుగుపెట్టేందుకు స్కెచ్ వేస్తున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన గాయత్రినగర్ డివిజన్ హాట్ సీటుగా మారింది. గాయత్రినగర్ ఏరియా గతంలో అల్లాపూర్ డివిజన్ లో భాగంగా ఉండేది. మైనార్టీలు ఎక్కువగా ఉండటంతో గత మూడు పర్యాయాలుగా మైనార్టీలే గెలుస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు అల్లాపూర్ నుంచి గాయత్రినగర్ డివైడ్ కావడంతో .. ఈ ప్రాంత నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.
గాయత్రినగర్ డివిజన్ నుంచి రేసులో చాలామంది నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో పలువురు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. సీనియర్ నాయకుడు దేవరింటి మస్తాన్ రెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సేవలో నిరంతరం శ్రమిస్తున్న మస్తాన్ రెడ్డి రంగంలోకి దిగితే గాయత్రినగర్ కార్పొరేటర్ గా గెలుపు ఖాయమనే చర్చలు కూడా సాగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ కూకట్ పల్లి ఇంచార్జ్ , టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేశ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో మస్తాన్ రెడ్డి తనదైన శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో అంతంతమాత్రంగా ఉన్న పార్టీని బలోపేతం చేస్తూ.. కేడర్ లో జోష్ నింపుతున్నారు. సేవా కార్యక్రమాల్లోను ముందున్నారు మస్తాన్ రెడ్డి. పేదలు, అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. అర్హులకు రేవంత్ సర్కార్ సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నారు. బండి రమేశ్ జన్మదినం రోజున దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణి చేసి ఆదర్శంగా నిలిచారు దేవరింటి మస్తాన్ రెడ్డి. తన సేవా కార్యక్రమాలతో డివిజన్ పరిధిలోని ఓటర్లకు దగ్గరయ్యారు మస్తాన్ రెడ్డి. తనకు కార్పొరేటర్ గా అవకాశం ఇస్తే ప్రజలకు మరింత సేవ చేస్తానని చెబుతున్నారు. నిరంతరం ప్రజాసేవలో ఉంటున్న మస్తాన్ రెడ్డి లాంటి నేతకే టికెట్ ఇవ్వాలని గాయత్రినగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ పెద్దలను కోరుతున్నారు. బండి రమేశ్ ను కలిసి మస్తాన్ రెడ్డికి మద్దతుగా వినతిపత్రాలు ఇస్తున్నారు.
గాయత్రినగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో సర్వే చేసినప్పుడు మెజార్టీ ప్రజల నుంచి మస్తాన్ రెడ్డి పేరే వినిపించింది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మస్తాన్ రెడ్డి లాంటి లీడర్ ను ప్రోత్సహిస్తే అందరికి మంచి జరుగుతుందని చెబుతున్నారు. మస్తాన్ రెడ్డికి టికెట్ ఇస్తే తామంతా స్వచ్చందంగా ప్రచారం చేసి గెలిపించుకుంటామని కాంగ్రెస్ పెద్దలకు హామీ ఇస్తున్నారు గాయత్రినగర్ డివిజన్ వాసులు. మరోవైపు తనకు టికెట్ ఇవ్వాలని జరుగుతున్న ప్రచారంపై స్పందించారు దేవరింటి మస్తాన్ రెడ్డి. ప్రజల ఆశిస్సులు ఉంటే ప్రజాసేవలో తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పెద్దలు ఆశీర్వదిస్తే కార్పొరేటర్ గా గెలిచి గాయత్రినగర్ ను దశ మారుస్తానని చెబుతున్నారు.





