తెలంగాణ

విద్యార్థులు మంచి లక్ష్యంతో ముందుకెళ్లాలి.. సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్

క్రైమ్ మిర్రర్, మర్రిగూడ : విద్యార్థులు మంచి లక్ష్యం నిర్దేశించుకొని ముందుకెళ్ళలని నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ అన్నారు. శనివారం నాడు మర్రిగూడ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పి ఆర్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు గమ్యం చేరాలంటే మంచి లక్ష్యం పెట్టుకొని చదవాలని పి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావు విజ్ఞానం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని,  దీనితో పాటు విష సంస్కృతి పైన, ఆడపిల్లల పైన జరుగుతున్న దాడులపై అవగాహన సదస్సులు కూడా పి ఆర్ ఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తాడని ఈ సమాజంలో సేవా భావంతో పనిచేసే వాళ్లు అరుదుగా ఉంటారని ఆయన అన్నారు. భవిష్యత్తులో పి ఆర్ ఆర్ ఫౌండేషన్ సమాజాన్ని చైతన్య పరిచే కార్యక్రమాలు మంచి ఫలితాన్ని సాధించాలని, చైర్మన్ చేల్లం పాండురంగారావు పెట్టుకున్న ఆశయం కోసం పనిచేస్తూ మునుముందుకు వెళ్లాలని విద్యార్థులు మెటీరియల్ సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలను సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులకు సీఐ, ఎస్ఐ, డిప్యూటీ తాసిల్దార్ చేతల మీదగా మెటీరియల్ అందించడం జరిగింది. కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ తారకరామన్, ఎస్సై కృష్ణారెడ్డి, పి ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ చేల్లం పాండురంగారావు, పాఠశాల ప్రిన్సిపల్ శివ స్వరూప రాణి, శశికళ, సీనియర్ జర్నలిస్టు సేవ్ తెలంగాణ ఎడిటర్ మహేశ్వరం సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

  1. దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
  2. మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం..
  3. ఓ గదిలో తల్లి మృతదేహం, మరో గదిలో ఇద్దరు కూతుళ్లు.. 9 రోజులు శవంతోనే..!
  4. పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్‌.. రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్‌
  5. రంజీల్లో కోహ్లీ ఒక్కరోజు జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!..

Back to top button