Tuesday, February 24, 2026
Homeతెలంగాణకొండా సురేఖ వర్గీయుల దౌర్జన్యం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మనిషిపై బీరు సీసాలతో దాడి

కొండా సురేఖ వర్గీయుల దౌర్జన్యం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మనిషిపై బీరు సీసాలతో దాడి

వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మరింత ముదిరింది. మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయులు కనిపిస్తే చాలు దాడులు చేసుకుంటున్నారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మధ్య వివాదం మరింత పెద్దది అవుతుంది. మంత్రి కొండా సురేఖ, మురళి నుండి తనకు ప్రాణభయం ఉందని ప్రకాశ్ రెడ్డి అనుచరుడు విడుదల చేశాడు.

తాను కారులో వెళ్తుండగా బయటకు రమ్మని పిలిచి కొండా అనుచరులు దారుణంగా దాడి చేశారని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయులు వాపోయారు. 40 మంది వరకు తనపై బీరు సీసాలతో దాడిచేశారని వీడియోలో తెలిపారు. గతంలోనూ తనపై దాడి జరిగిందని చెప్పాడు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments