Thursday, February 26, 2026
Homeక్రైమ్కన్న కూతురిని వ్యభిచారం చేయమని తల్లి ఒత్తిడి.. అల్వాల్‌లో దారుణం

కన్న కూతురిని వ్యభిచారం చేయమని తల్లి ఒత్తిడి.. అల్వాల్‌లో దారుణం

హైదరాబాద్ అల్వాల్ లో దారుణం జరిగింది. ఓ తల్లి కన్న కూతురిని వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసింది. దీంతో తల్లి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయిన యువతి.. అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.పోలీసులు స్పందించి ఆ యువతిని సఖి సెంటర్‌కు తరలించారు.దీంతో అల్వాల్ పీఎస్ ముందు బాలిక తల్లి, మద్దతుగా మరో మహిళ గొడవకు దిగారు. తమ కూతురిని అప్పగించాలంటూ రచ్చ చేశారు. వ్యభిచారం చేయమని చెప్పింది మీరు చూశారా అంటూ పోలీసులను నిలదీసింది. గొడవకు దిగిన ఇద్దరు మహిళలపై అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

కన్న కూతురిని వ్యభిచారం చేయమని తల్లి విషయంలో స్థానికులు కొత్త విషయాలు చెబుతున్నారు. ఆ బిడ్డ ఆమె సొంత బిడ్డ కాదని తెలుస్తోంది. 16 నెలల వయసులో ఎక్కడి నుంచో ఆ పాపను తెచ్చుకుని పెంచుకుందట. ఇప్పుడామే పెద్దదిగా కావడంతో వ్యభిచారం చేయమని బెదిరిస్తుందని అంటున్నారు. సొంత బిడ్డ కాకపోవడం వల్లే ఆ తల్లి ఇంతటి దారుణానికి తెగబడిందని స్థానికులు మండిపడుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments