ఆంధ్ర ప్రదేశ్క్రైమ్

కడపలో ఘోరం… పదహారేళ్ల బాలికను అతికిరాతకంగా నిప్పుంటించి మరి?

కడప జిల్లాలో అతి ఘోరాతిమైన ఘోరం జరిగింది. 16 ఏళ్ల బాలికను నిప్పంటించి చంపినటువంటి సంఘటన ప్రస్తుతం అన్ని సోషల్ మీడియాలోనూ కలకలం రేపుతుంది. యావత్ కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ విషయంపై సీరియస్ అయినా విషయం మనందరికీ తెలిసిందే. పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం చనిపోయిన బాలికకి 16 సంవత్సరాలు.ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఇక విగ్నేష్ మరియు ఈ బాలికకు గత ఐదు సంవత్సరాలుగా పరిచయం కూడా ఉంది. నిందితుడైనటువంటి విగ్నేష్ కి ఆరు నెలల క్రితమే మ్యారేజ్ కూడా అయింది. ప్రస్తుతం ఆమె భార్య ఇప్పుడు గర్భిణీ.

నీకు అసలు విషయానికి వస్తే శుక్రవారం నాడు విగ్నేష్ అమ్మాయికి కాల్ చేసి ఇద్దరం ఒకసారి కలుద్దాం లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడట. ఇక ఏం చేయాలో తెలియని అమ్మాయి శనివారం నాడు తన కాలేజీ నుంచి బయలుదేరి బద్వేలుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సమీప అడవిలోకి ఇద్దరు కూడా కలిసి వెళ్లారు. కొంచెం సేపు మాట్లాడుకొని ఆ తరువాత ఇద్దరు కూడా శృంగారంలో పాల్గొన్నారు అని పోలీసులు వెల్లడించారు. ఇక ఆ తర్వాత ఆ అమ్మాయి పదేపదే నన్ను పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఆగ్రహానికి గురైన విగ్నేష్ తన దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బాటిల్ తీసి ఆమెపై పోసి లైటర్ తో ఆమె చిన్నికి మంట అనేది అంటించాడు. ఇక దాంతో ఆమె ఒక్కసారిగా కేకలు వేయడంతో విగ్నేష్ అక్కడి నుండి పారిపోయాడు. ఇక ఆ తరువాత స్థానికులు ఆ బాలికను రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూనే జరిగిందంతా కూడా పోలీసులకు వివరించింది.

Read More : బీసీల గొంతుక తీన్మార్ మల్లన్నను టార్గెట్ చేసిన రెడ్లు!

ఆ చికిత్సను భరించలేని ఆ అమ్మాయి  అర్ధరాత్రి రెండు గంటల 30 నిమిషాలకు మరణించింది. ఇక దాంతో ఆ బాలిక కుటుంబం అంతా కూడా తీవ్ర ఆగ్రహానికి గురై మా అమ్మాయి జరిగినటువంటి సంఘటన కచ్చితంగా ఆ అబ్బాయిని కూడా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేయాలని మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. ఇక దాంతో ఈ వార్త అనేది అన్ని మీడియాలోనూ అలాగే సోషల్ మీడియాలోనూ వైరల్ అయిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. దీంతో ఏకంగా రాష్ట్ర సీఎం అలాగే హోం మంత్రి కూడా ఈ విషయం కఠినమైన శిక్షలు విధించాలని కోరారు. ఏది ఏమైనా తిరిగి ఆ బాలిక బతకలేదు కదా కనీసం ఆ నిందితుడికైనా మా అమ్మాయి లాగానే నిప్పుంటించి చంపేయాలని అబ్బాయికి తల్లి ఆవేదన వీడియో అనేది అన్ని టీవీలలోనూ టెలికాస్ట్ అవుతుంది.

Back to top button