తెలంగాణ
Trending

ఏకమైన బీజేపీ, బీఆర్ఎస్.. సీఎం రేవంత్ రెడ్డికి చుక్కలే?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రుణమాఫీ విషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రైతు రుణమాఫీపై హస్తం పార్టీపై కారు పార్టీ నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. సంపూర్ణ రైతు రుణమాఫీ జరగకుండానే.. రుణమాఫీ పూర్తి అయినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడుతున్నారు.

అర్హులందరికీ రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే రాజీనామాలకు సిద్దమని కేటీఆర్ , హరీష్ సవాల్ చేశారు. రుణమాఫీ విషయంలో రేవంత్ టార్గెట్ గా బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నా.. బీజేపీ మాత్రం పెద్దగా స్పందించడం లేదు. రాజకీయం అంతా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగిపోతోంది. ఈ రేసులో తాము వెనకబడిపోతున్నామని అనుకున్నారో ఏమో కానీ , బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం ఎంటర్ అయ్యారు. కేటీఆర్ ,హరీష్ రావు తరహాలోనే మహేశ్వర్ రెడ్డి సవాల్ విసరకుండా.. ఓ అడుగు ముందుకు వేశారు. రాష్రంలో సంపూర్ణంగా రుణమాఫీ జరిగినట్లు నిరూపిస్తే ఏకంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.

Read Read : సంచలనం.. రేవంత్ అభినందన సభకు బీజేపీ మంత్రి

17వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఏంటో చెప్పాలని మహేశ్వర్ రెడ్డి అన్నారు. గత కొద్ది రోజులుగా రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ వినిపిస్తోన్న వాదనకు ఇప్పుడు బీజేపీ కూడా జత అయిందని, దీంతో కాంగ్రెస్ రెండు పార్టీలను ఎలా ఎదుర్కొంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.ఈ రెండు విపక్ష పార్టీలు కలిస్తే సీఎం రేవంత్ రెడ్డికి చిక్కులు తప్పవనే టాక్ వస్తోంది.

Back to top button