తెలంగాణ

ఇంక్ లేదు.. వచ్చాక రండి.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బోర్డు

తెలంగాణలో విచిత్ర పరిణామాలు వెలుగుచూస్తున్నాయి. కొన్ని నెలలుగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. గత ఏడాదిలో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో భారీగా పతనం కనిపిస్తోంది. రియల్ ఎస్టేట్ ఢమాల్ అనడంతో రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా పడిపోయింది. జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణ అనుమతులు తగ్గిపోవడంతో ఆదాయం భారీగా తగ్గింది. ప్రభుత్వ కార్యాలయాల్లో వసతుల కల్పన తగ్గినట్లు తెలుస్తోంది. కొన్ని కార్యాలయాల్లో వైట్ పేపర్లు, పెన్ను.. పెన్సిల్ అయిపోయినా కొనడానికి బడ్జెట్ రావడం లేదని అంటున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో కనిపించిన బోర్డును చూసి జనాలు షాకవుతున్నారు. ఇదేం పరిస్థితి దేవుడా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంక్ లేదు.. ఫ్రాంకింగ్ మిషిన్ పనిచేయడం లేదంటూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బోర్డు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కాగితాలపై స్టిక్కర్లను అతికించే ఫ్రాంకింగ్ మిషన్ ఇంక్ అయిపో యింది.దీంతో సేవలకు అంతరాయం కల్గుతోంది. ఆస్తుల మార్టేజ్, ఎల్ఐసీ పాలసీదారుడు చనిపోయిన ధృవపత్రం , పుడు క్లియరెన్స్ పత్రాలు, బ్యాంకుల్లో లాకర్లు తీసుకునే పత్రాలపై ఫ్రాంకింగ్ మిషన్ ద్వారా వంద రూపాయలు అంతకు ఎక్కువ విలువైన స్టిక్కర్లను అతికిస్తారు.

అయితే మిషన్ ఇంక్ లేదంటూ సబ్ రిజిస్ట్రార్ పనులు ఆపేశారు. దీంతో ఆయా పనులపై కార్యాలయానికి వెళ్లిన వారు పనులు జరగక ఇబ్బందులు పడ్డారు.ఇంక్ కొనడానికి డబ్బులు లేకపోతే ఎలా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదేం పరిస్థితి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Back to top button