
సంచలనంగా మారిన మీర్ పేట మాధవి హత్య కేసులో పోలీసుల విచారణ ఇంకా కొలిక్కి రాలేదు. పోలీసుల దర్యాప్తుల్లో కొత్త కొత్త అంశాలు, విస్మయకర విషయాలు వెలుగులోనికి వస్కున్నారు. మీర్‌పేటలో ఈనెల 22న వెలుగుచూసిన వెంకట మాధవి హత్య కేసుకు సంబంధించి హత్య జరిగిన.. జనవరి 15న ఏం జరిగిందన్న విషయాలపై స్థానికుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు.హంతకుడు గురుమూర్తి, అతని భార్య మాధవి ఎలా ఉండేవారు.. వాళ్ల నడవడిక, గొడవలకు సంబంధించిన సమాచారం తెలుసుకున్నారు. గురుమూర్తి ప్రవర్తనపై అతని స్నేహితులు, కొలిగ్స్ ను విచారించారు పోలీసులు. కీలక ఆధారాలు సేకరించేందుకు ఇతర రాష్ట్రాల ఫోరెన్సిక్ నిపుణులు ఇంటిని పరిశీలించారు.
గురుమూర్తి జీ+2 భవనంలో రెండో అంతస్తులో అద్దెకు ఉంటున్నాడు.సంక్రాంతి పండుగ కావడంతో కొందరు సొంతూళ్లు వెళ్లారు. అదే అంతస్తులో ఉండే ఓ వ్యక్తి 15వ తేదీ ఉదయం బయటకెళ్లి ఇంటికొచ్చాడు. అప్పటికే గురుమూర్తి తన భార్యను చంపి ఇంట్లో ఉన్నాడు. పొరుగు వ్యక్తి ఇంట్లోకి వెళ్లే సమయంలో దుర్వాసన ఎక్కువగా రావడాన్ని పసిగట్టినట్టు తెలుస్తోంది. అయితే అనుమానాస్పదంగా ఉన్నా పండగ సమయంలో ఎవరో మాంసం వండుకుంటున్నారనే భావనతో పట్టించుకోకుండా వదిలేశాడు.భార్యను హత్య చేసి గురుమూర్తి డెడ్ బాడీని 72 ముక్కలు చేసి కాల్చేశాడని తెలుసుకుని ఆ వ్యక్తి వణికిపోయాడు. అదేరోజు రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు.
నిందితుడు గురుమూర్తి డీఆర్‌డీవోలో కాంట్రాక్టు సెక్యూరిటీగా గార్డుగా పనిచేస్తున్నాడు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి విచారించారు. ఇతర సబ్బింది ఆరా తీశారు. గురుమూర్తి ఎంతో క్రమశిక్షణతో ఉంటాడని, మృదుస్వభావి, సాయం చేసే వ్యక్తిత్వమని కొందరు చెప్పారు. ప్లాస్టిక్ వస్తువులు వాడేందుకు ఇష్టపడడని.. ఛాయ్ తాగేందుకు, భోజనం తెచ్చే క్యారేజీ కోసం కూడా ప్లాస్టిక్ ఉపయోగించడని పోలీసుల విచారణలో తేలింది.ఇటీవల ఓ తెలిసిన వ్యక్తిని ఉద్యోగంలో పెట్టించినట్లు ఉద్యోగులు పోలీసులకు వివరించారు.