క్రైమ్ మిర్రర్, ఆస్ట్రాలజీ డెస్క్: శ్రావణ పూర్ణిమ రోజే రాఖీ పూర్ణిమ జరుపుకుంటారు. అక్కా చెల్లెళ్లు తమ సోదరులు ఎప్పుడూ సంతోషంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కడతారు. రాఖీ పౌర్ణమి వెనుక పురాణ కథనాలు కూడా ఉన్నాయి. అక్కా చెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టి వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటే.. సోదరులు తమ అక్కాచెల్లెళ్ళకు జీవితాంతం ఎలాంటి పరిస్థితులలో అయినా తోడుగా ఉంటామని, రక్షణ కల్పిస్తామని వాగ్ధానం చేస్తారు.
అయితే రాఖీ ఎప్పుడు కట్టకూడదు.. ఎప్పుడు కట్టాలి?
రాఖీ కట్టడానికి ఒక నిర్దేశిత సమయం ఉంది. రాఖీ పౌర్ణమి రోజు వచ్చే భధ్రకాలాన్ని ఆ రోజు పరిగణలోకి తీసుకుంటారు. భద్రుని నీడ ఉన్న సమయంలో రాఖీ కట్టకూడదని అంటారు. ఈ ఏడాది రాఖీ పండుగ ఆగస్టు 19 వ తేదీ సోమవారం వచ్చింది. ఆ రోజు తెల్లవారుజామున 3.04 గంటల నుండి రాత్రి 11.55 వరకు పౌర్ణమి ఉంటుంది. అయితే ఇందులో భద్రకాలం కూడా ఉంటుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు.రాఖీ పౌర్ణమి రోజు ఉదయం 9.51 కి భద్రకాలం ప్రారంభమవుతుంది. ఆ తరువాత మధ్యాహ్నం 1.30 కి ఈ భద్రకాలం ముగుస్తుంది. ఈ సమయంలో రాఖీ కట్టకూడదు.
భద్ర లంకాధిపతి రావణాసురుడికి సోదరి అని పురాణ కథనాలు చెబుతున్నాయి. రావణాసురుడి చెల్లెలు భద్ర పౌర్ణమి అనుకుని ఇంకా పౌర్ణమి తిథి రాకముందే రావణాసురుడికి రక్ష కట్టిందట. ఈ కారణంగానే రావణాసురుడికి రాముడి చేతిలో మరణం సంభవించింది అని పురాణ కథనాల సారాంశం. అందుకే అన్నదమ్ములకు భద్రకాలంలో రాఖీ కడితే కీడు జరుగుతుందని అంటారు.
Read More : కవితకు బెయిల్ ఇప్పిస్తున్న సీఎం రేవంత్ లాయర్!
మరొక కథనం ప్రకారం సూర్యుడి కుమార్తె పేరు భద్ర. ఈమె శనిదేవుడికి సోదరి. శనిదేవుడి లాగే ఈమె కూడా కఠినంగా ఉంటుందట. ఆమె ఉనికిలో ఉన్న సమయంలో సమస్త ప్రపంచాన్ని తన స్వరూపంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుందట. శుభకార్యాలు, పనులు అడ్డుకోవడం, కీడు చేయడం, పనులలో అవాంతరాలు సృష్టించడం వంటివి చేస్తుందట. ఇలాంటి సమయంలో సోదరులకు రాఖీ కడితే అది సోదరులకు కీడుగా మారే అవకాశం ఉందని అంటారు. అందుకే భద్ర కాలంలో కేవలం రాఖీ కట్టడమే కాదు.. వేరే ఇతర పనులు, శుభకార్యాలు కూడా తలపెట్టకూడదని అంటారు.
భద్రకాలం ముగిసిన తరువాత రాఖీ కట్టడం మంచిది. రాఖీ పౌర్ణమి రోజు మధ్యాహ్నం 1.30 కి భద్రకాలం ముగుస్తుంది. ఆ తరువాత అంటే.. ఆగస్టు 19 వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల తరువాత రాఖీ కట్టవచ్చు. రాత్రి 7 గంటల వరకు రాఖీ కట్టెందుకు మంచి సమయం ఉంది.